బాలీవుడ్‌లో ‘సైరా’ అట్టర్ ప్లాప్‌కు కారణాలివే!!

These Reasons.. why SyeRaa Failed in Bollywood Markets!

Fri 13th Dec 2019 10:46 AM
sye raa narasimha reddy,hindi markets,megastar chiranjeevi,amithab bachhan,sudeep  బాలీవుడ్‌లో ‘సైరా’ అట్టర్ ప్లాప్‌కు కారణాలివే!!
These Reasons.. why SyeRaa Failed in Bollywood Markets! బాలీవుడ్‌లో ‘సైరా’ అట్టర్ ప్లాప్‌కు కారణాలివే!!
Advertisement

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’ తెలుగు రాష్ట్రాల్లో సూపర్ డూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆశించిన దానికంటే ఎక్కువే హిట్టవ్వడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే బాలీవుడ్‌లో మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది. వాస్తవానికి ఈ సినిమా కోసం అన్ని ఇండస్ట్రీల నుంచి బిగ్‌షాట్స్‌ను తీసుకోవడానికి కారణాలు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌ నుంచి బిగ్‌బీని తీసుకుంటే హిందీలో కలిసొస్తుందని.. ఇలా ఒక్కొ లాంగ్వేజ్‌ నుంచి ఒక్కొక్కర్ని తీసుకున్నారు. అలా అయితే సినిమా కూడా సక్సెస్‌కు కలిసొస్తుందని తీసుకున్నారు. తీరా చూస్తే తెలుగులో హిట్టయ్యింది కానీ బాలీవుడ్‌‌‌లో అట్టర్ ప్లాప్ అయ్యింది.  బాహుబలి బాటలోనే బాలీవుడ్ ఆడియెన్స్ ఆదరిస్తారని భావించిన సైరా మేకర్స్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. బాహుబలి రేంజ్‌లో కాకపోయినా కాస్త అటో ఇటో ఆడుతుందని సినిమా యూనిట్ ఆశలు పెట్టుకుంది. అయితే ఆ ఆశలన్నీ అడియాసలయ్యాయి. 

అయితే బాలీవుడ్‌లో ఈ సినిమా ఎందుకు సక్సెస్ కాలేకపోయింది..? కారణాలేంటి..? అనే విషయాలను తాజాగా కన్నడ హీరో సుదీప్ చెప్పుకొచ్చాడు. ‘నా ఉద్దేశ్యం ప్రకారం ‘సైరా’ బాలీవుడ్ ఆడియెన్స్‌ను ఆకట్టుకోకపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. మొదట కారణం ఈ సినిమా బయోపిక్ కావడం.. ఒక ప్రాంతానికి మాత్రమే చెందినది కావడంతో ఉత్తరాది ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ఇలాంటి భారీ సినిమాలు తీసేటప్పుడు ఫిక్షన్ కథలైతేనే బాగుంటుంది. బాహుబలి అందుకే ఘన విజయం సాధించింది. మేకింగ్ విషయంలో మాత్రం సైరా మూవీ అందరినీ ఆకట్టుకుంది’ అని సుదీప్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘దబాంగ్-3’ మూవీ ప్రమోషన్స్‌లో ‘సైరా’ ఫెయిల్యూర్ ప్రస్తావన రాగా పై విధంగా సుదీప్ చెప్పుకొచ్చాడు.

These Reasons.. why SyeRaa Failed in Bollywood Markets!:

These Reasons.. why SyeRaa Failed in Bollywood Markets!


Loading..
Loading..
Loading..
advertisement