Advertisement

‘అమ్మరాజ్యం’కు అడ్డెవరు.. 50 లక్షల సంగతేంటి!?

Wed 11th Dec 2019 05:31 PM
ram gopal varma,amma rajyam lo kadapa biddalu,high court,censor board,rgv,prptest  ‘అమ్మరాజ్యం’కు అడ్డెవరు.. 50 లక్షల సంగతేంటి!?
RGV Ammarajyam Unit Protest Infront Of Censor Board ‘అమ్మరాజ్యం’కు అడ్డెవరు.. 50 లక్షల సంగతేంటి!?
Advertisement

రాంగోపాల్ వర్మ తన టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై అందిస్తున్న తాజా సంచలన చిత్రం ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’. రాంగోపాల్ వర్మతో కలిసి సిద్దార్థ తాతోలు దర్శకత్వం వహించారు. కాగా.. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు రివైజింగ్ కమిటీలో పూర్తి చేసుకుందని.. యు/ఎ  సర్టిఫికెట్ లభించిందని ఇటీవలే వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని ఆర్జీవీ తన ట్విట్టర్ వేదికగా కూడా ప్రకటించారు. అంతేకాదు.. ఈ నెల 12న అనగా గురువారం ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.

ఎందుకిలా జరుగుతోంది..!

ఎల్లుండి సినిమా రిలీజ్ చేస్తున్న టైమ్‌లో ఆర్జీవీకి హైకోర్టు నుంచి ఊహించని షాక్ ఎదురైంది. సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వలేదని సెన్సార్ బోర్డు, కట్స్ అన్నీ చేసిన తర్వాత ఇక్కడికి రావాలని కోర్టు ఆర్జీవీని ఆదేశించింది. ఈ క్రమంలో కట్స్ అన్నీ కోర్టుకు సమర్పించినప్పటికీ గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో చిత్రబృందం తీవ్ర అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో సెన్సార్ బోర్డు వద్ద చిత్ర యూనిట్ ఆందోళనకు దిగింది. ఈ సందర్భంగా నిర్మాత నట్టి కుమార్ మీడియాతో మాట్లాడుతూ సెన్సార్, టీడీపీ నేతలు, సుజనా చౌదరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

సుజనా.. ఆ 50 లక్షల సంగతేంటి!?

‘సెన్సార్ బోర్డు రాజశేఖర్ సినిమా చూసి ఆర్సీకి రెఫర్ చేశారు. కట్స్ సబ్మిట్ చేయమని అడిగారు.. అన్ని వివరాలు పొందుపరిచి ఇచ్చాం. కానీ ఇప్పటికీ వరకు మా సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేద. 12 తేదీ రిలీజ్ చేయడానికి  మేము డేట్ కూడా ప్రకటించేసుకున్నాం. సుజనా చౌదరి మా సినిమాను అడ్డుకుంటున్నారు. టీడీపీ నేతలు 50 లక్షల రూపాయలు ఇచ్చి సినిమాను అపుతున్నారు. సినిమా విడుదల అయితే ప్రతిపక్ష హోదా పోతుంది. రాజశేఖర్ మాకు 50 లక్షలు డిమాండ్ చేశాడు. ఆర్వో రాజశేఖర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ ఉంది. న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది. ఈ రోజు హైకోర్టు తీర్పు తర్వాత మా నిర్ణయం ప్రకటిస్తాం’ అని నట్టికుమార్ చెప్పుకొచ్చారు.

కాగా ఇంతవరకూ కొన్ని వర్గాలను ఈ సినిమాను టార్గెట్ చేసినట్లుందని ఒకరిద్దరు కోర్టులో పిటిషన్ వేయడం.. విచారణ పూర్తయ్యింది. కానీ ఇప్పుడు మాత్రం కొత్తగా సుజనా చౌదరి, రాజశేఖర్‌లు, రూ. 50 లక్షల డిమాండ్ తెరపైకి వచ్చాయి. మరి ఈ క్రమంలో చిత్రబృందం ఎలా స్పందిస్తుంది..? కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది..? సెన్సార్ సంగతేంటి..? పోీలసు కేసు పెడితే పరిస్థితేంటి..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఇప్పటికే పలువురు ఆర్జీవీ అభిమానులు, ఔత్సాహికులు టికెట్స్ బుక్ చేసుకున్నారు వారి సంగతేంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ వ్యవహారంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని గంటలు వేచిచూడక తప్పదు మరి.

RGV Ammarajyam Unit Protest Infront Of Censor Board:

RGV Ammarajyam Unit Protest Infront Of Censor Board  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement