విజయ్‌ సినిమాలో ‘తమ్ముడు’.. కలిసొచ్చేనా!

Tue 10th Dec 2019 06:31 PM
anand devarakonda,vijay devarakonda,puri jagannath,siva nirvana movie,key role  విజయ్‌ సినిమాలో ‘తమ్ముడు’.. కలిసొచ్చేనా!
Anand Devarakonda In Brother Vijay Movie.. Details Here..! విజయ్‌ సినిమాలో ‘తమ్ముడు’.. కలిసొచ్చేనా!
Sponsored links

టాలీవుడ్ బిజిబిజీగా గడుపుతున్న హీరో విజయ్‌దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’గా అభిమానుల ముందుకు రాబోతున్నాడు. ఆ తర్వాత పూరీ జగన్నాథ్‌‌ ‘ఫైటర్’ సినిమాలో నటించనున్నాడు. ఈ రెండే కాకుండా శివ నిర్వాణ దర్శకత్వంలోనూ ఓ సినిమాకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే తనతో పాటు తన తమ్ముడు ఆనంద్ దేవరకొండను కూడా టాలీవుడ్‌లో నిలదొక్కుకునేలా చేయాలని విజయ్ చేస్తున్న భగీరథ ప్రయత్నాలు అన్నీ ఇన్నీకావు. ఇప్పటికే ఆనంద్ దేవరకొండ, డాక్టర్ రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక నటీనటులుగా వచ్చిన ‘దొరసాని’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆశించినంతగా ఆడలేదు. లవర్స్‌ను ఈ మూవీ మెప్పిస్తుందని దర్శకనిర్మాతలు ఆశించారు.. అయితే వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి.

అయితే ఇక ప్రస్తుతానికి సోలోగా ఆనంద్‌కు గ్యాప్‌ ఇచ్చి.. తన సినిమాలోనే ఓ కీలక పాత్ర ఇవ్వాలని విజయ్ యోచిస్తున్నాడట. అయితే ఆ కీలక పాత్ర పూరీ సినిమాలోనా..? లేకుంటే నిర్వాణ మూవీలోనా అనేది మాత్రం క్లారిటీ రాలేదు. అయితే ఆ కీలక పాత్ర ఏంటి..? ఇంతకీ కీలక పాత్ర లేకుంటే మరేమైనా పాత్రా..? అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఆనంద్ మాత్రం సోలోగా రెండో సినిమాలు నటిస్తున్నాడు. మరి కీలక పాత్రతో అయినా లేకుంటే సోలో హీరోగా నటించే సినిమా అయినా మంచి కలిసొస్తుందో..? లేదో..? వేచి చూడాలి.!

Sponsored links

Anand Devarakonda In Brother Vijay Movie.. Details Here..!:

Anand Devarakonda In Brother Vijay Movie.. Details Here..!  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019