‘అమరం అఖిలం ప్రేమ’ టీజర్ వదిలారు

Amaram Akhilam Prema Teaser released

Mon 09th Dec 2019 07:30 PM
koratala siva,sukumar,amaram akhilam prema,teaser,vijay ram  ‘అమరం అఖిలం ప్రేమ’ టీజర్ వదిలారు
Amaram Akhilam Prema Teaser released ‘అమరం అఖిలం ప్రేమ’ టీజర్ వదిలారు
Advertisement

సుకుమార్ గుర్తించిన యంగ్ టాలెంటెడ్ టీమ్ అంటే తప్పకుండా వీరిలో వున్న ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘అమరం అఖిలం ప్రేమ’ అనే ఈ టైటిల్ చాలా పాజిటివ్‌గా ఉంది. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. సుకుమార్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ సినిమా తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం వుంది అన్నారు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ. విజయ్‌రామ్, శివశక్తి సచ్‌దేవ్ జంటగా జోనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వంలో వీఆర్ చలనచిత్రాలు పతాకంపై వీఈవీకేడీఎస్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘అమరం అఖిలం ప్రేమ’. ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్‌తో కలిసి కొరటాల శివ ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. ఈ చిత్ర నిర్మాత ప్రసాద్‌తో నాది 20 ఏళ్ళ ప్రయాణం. లెక్చరర్స్‌గా ఇద్దరం కలిసి పనిచేశాం. ప్రసాద్ ఈ చిత్రంతో నిర్మాతగా మారటం ఆనందంగా వుంది. విజయ్ రామ్‌ను హీరోగా చూడాలనేది ఆయన తండ్రి కోరిక. నటుడిగా అన్ని రకాల ఎమోషన్స్ పండించడమే ఓ హీరోకు కావాల్సిన అర్హత. అది విజయ్‌రామ్‌లో వుంది. ఈ చిత్ర దర్శకుడు జోనాథన్ నాకు చాలా ఏళ్ళ నుండి తెలుసు. ఎంతో ప్రతిభావంతుడైన దర్శకుడు. రసూల్ ఎల్లోర్ విజువల్స్ అద్భుతంగా వున్నాయి. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది అని తెలిపారు. సుకుమార్ తనను గుర్తించి హీరోగా ఎంకరేజ్ చేశారని హీరో విజయ్‌రామ్ తెలిపారు. 

దర్శకుడు మాట్లాడుతూ సుకుమార్ గారు లేకపోతే ఈ రోజు నేను దర్శకుడిగా మీ ముందు వుండేవాడ్ని కాదు. మొదట్నుంచీ ఆయన ప్రోత్సాహం ఎంతో వుంది. ఎంతో వ్యయ ప్రయాసాలతో నిర్మాత ప్రసాద్ ఈ చిత్రాన్ని రాజీపడకుండా నిర్మించారు. బొమ్మరిల్లుతో జెనీలియాకు ఎంత మంచి పేరు వచ్చిందో ఈ చిత్ర నాయిక శివశక్తికి ఈ చిత్రంతో అంత పేరు వస్తుంది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ నా మీద ప్రేమతో ఈ వేడుకకు విచ్చేసి, మమ్ములను ప్రోత్సాహిస్తున్న సుకుమార్, కొరటాల శివకు నా కృతజ్ఞతలు. తప్పకుండా ఈ చిత్రం అందరి ప్రశంసలు పొందుతుందనే నమ్మకం వుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెమెరామెన్ రసూల్ ఎల్లోర్, సంగీత దర్శకుడు రథన్, నటుడు శ్రీకాంత్, మాటల రచయిత శ్రీకాంత్ విస్సా, జక్కా హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Amaram Akhilam Prema Teaser released:

Koratala Siva and Sukumar Launches Amaram Akhilam Prema Teaser


Loading..
Loading..
Loading..
advertisement