‘విక్టోరియా’ చిత్రం మొదలైంది

Mon 09th Dec 2019 01:30 PM
victoria,naveen lotla director,victoria maharani,movie opening,raj kandukuri,samudra  ‘విక్టోరియా’ చిత్రం మొదలైంది
Victoria Movie Launch Details ‘విక్టోరియా’ చిత్రం మొదలైంది
Sponsored links

మోహన్ ప్రొడక్షన్స్ సమర్పణలో చిత్రాన్షి ద్రంజ్, సంరీన్ మజిర్, పింకీలు ప్రధాన పాత్రధారులుగా నవీన్ లొట్ల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘విక్టోరియా’. దీనికి ట్యాగ్‌లైన్ ‘మహారాణి’. ఓ ముగ్గురు అమ్మాయిల మధ్య జరిగిన అనుకోని సంఘటనలు, వారి జీవితాల్లో ఏ విధమైన మార్పులు తీసుకువచ్చాయి అనేది ఈసినిమా ముఖ్య భూమిక. అలానే అమ్మాయిలను అఘాయిత్యం చేసి చంపేయడం, ప్రజలు దాని గురించి సామాజిక మాధ్యమాల్లో చర్చించడం కామన్ టాపిక్ అయిపోయింది. ఈ తరహా తీరును ఈ సినిమాలో ప్రస్తావిస్తూ తెరకెక్కించిన చిత్రమే ‘విక్టోరియా’. వి. అర్జున్ అప్పారావు నిర్మాతగా వ్యవహరిస్తున్నఈ చిత్రం ఆదివారం ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ నూతన చిత్రానికి క్లాప్ నిర్మాత రాజ్ కందుకూరి ఇవ్వగా,గౌరవ దర్శకత్వం సీనియర్ దర్శకుడు సముద్ర వహించగా, ఆన్ శ్రీ. రాఘవ సతీష్ స్వామిజీ కెమెరా స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు నవీన్ లొట్ల మాట్లాడుతూ.. ఓ ముగ్గురు అమ్మాయిల మధ్య జరిగిన అనుకోని సంఘటనలు, వారి జీవితాల్లో ఏ విధమైన మార్పులు తీసుకువచ్చాయి అనేది చిత్ర కథాంశం. 6 నెలలుగా ఈ చిత్ర కథపై కష్టపడి అర్జున్ అప్పారావుగారికి వినిపించడం జరిగింది. ఆయనకు కథ నచ్చి వెంటనే అంగీకరించి నాకు ఈ అవకాశాన్ని కల్పించారు. అందుకు ఆయనకు నా కృతజ్ఞతలు. ఇక ఈ సినిమాలో స్క్రీన్‌ప్లే హైలెట్‌గా నిలుస్తుంది. అదే సినిమాకు బలం అని చెప్పొచ్చు. త్వరలో సెట్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో మరికొంత మంది ప్రముఖ నటీనటులు నటించనున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అర్జున్ అప్పారావు, మురళి వై కృష్ణ, చిత్రాన్షి ద్రంజ్, సంరీన్ మజిర్, పింకీ ఇతరులు పాల్గొన్నారు.

చిత్రాన్షి ద్రంజ్, సంరీన్ మజిర్, పింకీ, రఘుబాబు, చమ్మక్ చంద్ర, విజయ్, నాని భాష తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: మురళి వై. కృష్ణ, మ్యూజిక్: ఎల్. వి. ముత్తు గణేష్, ఎడిటర్: మోహన్ రామా రావు, మేనేజర్: రవీందర్, నిర్మాత: వి. అర్జున్ అప్పారావు, స్టోరీ- డైలాగ్స్-డైరెక్షన్: నవీన్ లొట్ల.

Sponsored links

Victoria Movie Launch Details:

Raj Kandukuri Clap to Victoria Movie 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019