సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్ సోమవారం ట్రీట్‌కు రెడీనా!

Sun 08th Dec 2019 02:28 PM
sarileru neekevvaru,second song,release,monday  సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్ సోమవారం ట్రీట్‌కు రెడీనా!
Superstar Mahesh Sarileru Neekevvaru Second Song Release Details సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్ సోమవారం ట్రీట్‌కు రెడీనా!
Sponsored links

సోమవారం సాయంత్రం 5:04కి  సూపర్‌స్టార్‌ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సెకండ్ సాంగ్‌ ‘సూర్యుడివో చంద్రుడివో’

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ చిత్రం నుండి విడుదలైన ఫ‌స్ట్ సాంగ్‌ ‘మైండ్ బ్లాక్’ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటకి వచ్చిన పాపులారిటీ దృష్ట్యా మేకర్స్ స్పెషల్ కాంటెస్ట్ లు కూడా అనౌన్స్ చేశారు. చార్ట్ బస్టర్ గా నిలిచిన ఫస్ట్ సాంగ్ తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం నుండి సెకండ్ సింగిల్ సూర్యుడివో చంద్రుడివో... సోల్ ఫుల్ మెలోడీని డిసెంబర్ 9 (సోమవారం) సాయంత్రం 5:04 నిమిషాలకు విడుదల చేయనుంది చిత్ర యూనిట్. సంక్రాంతి కానుకగా జనవరి11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

Sponsored links

Superstar Mahesh Sarileru Neekevvaru Second Song Release Details:

Sarileru Neekevvaru Second Song Release on Monday

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019