‘సూసైడ్ క్లబ్’పై హిట్టు నిర్మాత ప్రశంసలు

Sat 07th Dec 2019 07:28 PM
suicide club film,producer,rahul yadav nakka,watches,agent sai srinivasa athreya  ‘సూసైడ్ క్లబ్’పై హిట్టు నిర్మాత ప్రశంసలు
Producer Rahul Yadav Nakka Praises Suicide Club Film ‘సూసైడ్ క్లబ్’పై హిట్టు నిర్మాత ప్రశంసలు
Sponsored links

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ నిర్మాత ప్రశంసలు అందుకున్న ‘సూసైడ్ క్లబ్’ చిత్రం

3ఐ ఫిలిమ్స్ సమర్పణలో మజిలీ సినిమా ఫేమ్ శివ రామచంద్రవరపు లీడ్ రోల్‌లో.. ప్రవీణ్ యండమూరి, సాకేత్, వెంకట కృష్ణ, చందన హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సూసైడ్ క్లబ్’. శ్రీనివాస్ బొగడపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ ప్రభు వెంకటేశం మరియు 3ఐ ఫిలిమ్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సినిమాకు సంబందించిన అన్ని కార్యక్రమాలు దాదాపు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం అవుతున్న తరుణంలో ఈ సినిమాపై ఉన్న అపారమైన నమ్మకంతో ట్రయిల్ షోను నిర్వహించారు చిత్ర బృందం. ఈ  కార్యక్రమంలో ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా, డైరెక్టర్ మల్లి తదితరులు చిత్రాన్ని వీక్షించారు. అనంతరం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో మొదటగా ప్రముఖ నిర్మాత రాహూల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ.. ‘‘ఒక చక్కటి పాయింట్‌తో డైరెక్టర్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించాడు. టెక్నికల్‌గా కూడా ఈ చిత్రం డిఫ్రెంట్‌గా ఉంది. అలాగే మంచి సోషల్ కాజ్‌తో డైరెక్టర్ శ్రీనివాస్, నిర్మాత ప్రవీణ్ ప్రభు ఈ చిత్రాన్ని తెరకెక్కించినందుకు వారిని అభినందిస్తున్నాను’’ అన్నారు.

డైరెక్టర్ శ్రీనివాస్ బొగడపాటి మాట్లాడుతూ.. ‘‘నేను రియల్ లైఫ్‌లో చూసిన ఇన్సిడెంట్‌ను ఇంప్లిమెంట్ చేసి సినిమాటిక్‌గా చేసిన చిత్రమే ‘సూసైడ్ క్లబ్’. కంప్లీట్‌గా స్క్రీన్‌ప్లే బేస్డ్ స్టోరీ. శివ పర్ఫెక్ట్‌గా సరిపోయాడు. ఇక వెంకట్ ప్లే చేసిన రోల్ అయితే యూనిక్‌గా ఉంటుంది. మా చిత్ర యూనిట్‌లో ఉన్న 80 మందిలో చందన ఒక్కటే అమ్మాయి. సినిమాలో చాలా బాగా యాక్ట్ చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ ఇరగదీసాడు అని చెప్పాలి. ఎడిటర్ శర్వా ఎడిటింగ్ స్కిల్స్ సూపర్ అనిపిస్తాయి. త్వరలో మూవీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాము..’’ అన్నారు.

ఈ చిత్రానికి రైటర్ మరియు డైరెక్టర్: శ్రీనివాస్ బొగడపాటి, ప్రొడ్యూసర్: 3ఐ ఫిలిమ్స్ అండ్ ప్రవీణ్ ప్రభు వెంకటేశం, మ్యూజిక్: కున్ని గుడిపాటి, ఎడిటర్: డే సెల్వ, ఆర్ట్: శాన్ నవార్, విజువల్స్: పవన్ కుమార్ తడక, కుమార్ నిర్మల సృజన్, పి.ఆర్.ఓ: బి.వీరబాబు, సౌండ్: రాఘవ చరణ్.

Sponsored links

Producer Rahul Yadav Nakka Praises Suicide Club Film:

Producer Rahul Yadav Nakka watched Suicide Club Movie

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019