సీపీ సజ్జనార్‌కు సలామ్ కొడుతున్నారు

Praises on CP Sajjanar in Social Media

Fri 06th Dec 2019 09:33 PM
encounter specialist,cp sajjanar,trending,twitter,praises,disha incident  సీపీ సజ్జనార్‌కు సలామ్ కొడుతున్నారు
Praises on CP Sajjanar in Social Media సీపీ సజ్జనార్‌కు సలామ్ కొడుతున్నారు
Advertisement

ప్రస్తుతం హైదరాబాద్‌లో దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌‌తో సిపి సజ్జనార్ పేరు మార్మోగిపోతోంది. కేసీఆర్ ఆదేశాల మేరకు సిపి సజ్జనార్ దిశ నిందితులను ఈ ఎన్‌కౌంటర్‌‌లో లేపెయ్యడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా సాక్షిగా సీపీకి సలాం కొడుతున్నారు. కేసీఆర్‌కి ఎంతగా అభివాదం చేస్తున్నారో... ఈ ఎన్‌కౌంటర్‌‌లో సిపిని నువ్వు మగాడివిరా అంటూ హర్షద్వానాలతో ఆయన్ని పోగుతున్నారు. దిశకి న్యాయం జరిగింది అని నొక్కి వక్కాణిస్తున్నారు. దిశ దోషుల ఎన్‌కౌంటర్‌ అనగానే అందరు ఒళ్ళు జలదరించడం కాదు పులకించిపోయింది. తమకే న్యాయం జరిగినట్టుగా అందరూ ఫీల్ అవుతున్నారు. సిపి సజ్జనార్ మొదటి నుండి ఈ కేసుని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అడ్డదిడ్డంగా ఉన్న మీడియా ప్రశ్నలకు, ఇతర ప్రశ్నలకు తగిన సమాధానం ఈ ఎన్‌కౌంటర్‌‌తో చెప్పారు సజ్జనార్.

గతంలో వైఎస్సార్ హయాంలో వరంగల్‌లో యాసిడ్ నిందితులను ఎస్పీగా ఉన్న సజ్జనార్ ఆధ్వర్యంలో ఎన్‌కౌంటర్‌‌లో లేపేసినట్టుగా... ఇప్పుడు దిశ దోషులని ఆమెని హత్య చేసిన స్థలంలో.. ఆమెని చంపేసిన సమయంలోనే ఎన్‌కౌంటర్‌ చెయ్యడం అది కూడా యాసిడ్ దోషులకు ఎలా జరిగిందో అలానే... అంటే సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే టైం లోనే దోషులు పారిపోతుండగా ఎన్‌కౌంటర్‌ చెయ్యడం అనేది యాదృశ్చ్ఛికమా ? లేదంటే యింకేదన్నానా? అని ఆలోచించడం కంటే.. వారికీ శిక్ష పడడం మాత్రం మహదానందంగా ఉంది. అందుకే అందరూ సిపి సజ్జనార్‌కి సలాం కొడుతున్నారు. తెలంగాణ పోలీస్‌లని అభినందిస్తున్నారు. ఏది ఏమైనా దిశ ఆత్మకు శాంతి.. ఆమెను హత్య చేసిన నిందితుల ఎన్‌కౌంటర్‌‌తో జరిగింది అని దిశ తల్లితండ్రులు చెబుతున్నారు. అది నిజంగా నిజం.

Praises on CP Sajjanar in Social Media:

Encounter Specialist CP Sajjanar Trending in Twitter


Loading..
Loading..
Loading..
advertisement