‘రూల‌ర్’ ప్రీ రిలీజ్ వేడుక ఎప్పుడు? ఎక్కడంటే?

Fri 06th Dec 2019 11:50 AM
balakrishna,ruler movie,pre release,event,date locked  ‘రూల‌ర్’ ప్రీ రిలీజ్ వేడుక ఎప్పుడు? ఎక్కడంటే?
Balayya Ruler Movie pre release event date Locked ‘రూల‌ర్’ ప్రీ రిలీజ్ వేడుక ఎప్పుడు? ఎక్కడంటే?
Sponsored links

ఈ నెల 14న వైజాగ్‌లో ఘ‌నంగా జ‌ర‌గ‌నున్న ‘రూల‌ర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘రూల‌ర్‌’. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య్ర‌క‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అన్ని కార్యక్ర‌మాలు పూర్తి చేసి సినిమాను డిసెంబ‌ర్ 20న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.  కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ నెల 14న వైజాగ్ ఎంజీఎం గ్రౌండ్స్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. ఈ వేడుక‌లో ఎంటైర్ చిత్ర యూనిట్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొంటున్నారు.

ఈ చిత్రంలో రెండు ప‌వ‌ర్‌ఫుల్ షేడ్స్‌లో బాల‌కృష్ణ న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన బాల‌కృష్ణ లుక్స్, టీజ‌ర్‌, లిరిక‌ల్ వీడియో సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది.త్వ‌ర‌లోనే మిగిలిన పాట‌ల లిరిక‌ల్ వీడియోల‌ను, ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

‘జైసింహా’ వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత బాల‌కృష్ణ‌, కె.ఎస్‌.ర‌వికుమార్‌, సి.క‌ల్యాణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.  సోనాల్ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్ర‌కాశ్‌రాజ్‌, భూమిక‌, జ‌య‌సుధ‌, షాయాజీ షిండే, ధ‌న్‌రాజ్‌, కారుమంచి ర‌ఘు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ధారులు. ఈ చిత్రానికి చిరంత‌న్ భ‌ట్ సంగీతాన్ని, రామ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

నటీనటులు:

నందమూరి బాలకృష్ణ

సోనాల్ చౌహాన్

వేదిక

ప్రకాశ్ రాజ్

భూమిక చావ్లా

జయసుధ

షాయాజీ షిండే

నాగినీడు

సప్తగిరి

శ్రీనివాస్‌రెడ్డి

రఘుబాబు

ధన్‌రాజ్ తదితరులు

సాంకేతిక నిపుణులు:

దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్

నిర్మాత: సి.కల్యాణ్

కో ప్రొడ్యూసర్స్:  సి.వి.రావ్, పత్సా నాగరాజు

కథ: పరుచూరి మురళి

మ్యూజిక్: చిరంతన్ భట్

సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్

ఆర్ట్: చిన్నా

పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల

ఫైట్స్: రామ్ లక్ష్మణ్, అన్బు, అరివు

కొరియోగ్రఫీ: జానీ మాస్టర్ 

Sponsored links

Balayya Ruler Movie pre release event date Locked:

Ruler Movie Pre Release Event details

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019