తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్ మూవీ అప్డేట్ ఇదే!

Thu 05th Dec 2019 10:27 PM
tholubommala sitralu,banner,movie,shooting,completed  తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్ మూవీ అప్డేట్ ఇదే!
TholuBommala Sitralu Banner Movie Latest Update తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్ మూవీ అప్డేట్ ఇదే!
Sponsored links

తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్ పై కోమారి జానకిరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ఒక పాట మినహా షూటింగ్ పూర్తి !!!

తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్ పై నూతన దర్శకులు కొమారి జానకిరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ఒక పాట మినహా మిగిలిన షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా పాత కొత్త నటీనటులతో పాటు కోమరక్క, స్వప్న, వేదం నాగయ్య, పద్మారావు, ఆదినారాయణ, గోవింద్ రాజు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 

ఈ సందర్భంగా దర్శకులు జానకిరామ్ మాట్లాడుతూ... ఉదయ్ భాస్కర్, చందు, పోసాని కృష్ణమురళి వద్ద దర్శకత్వ శాఖలో పని చేశానని తెలిపారు. ఇది నాకు తొలి చిత్రం. అంతర్వేది, మచిలీపట్నం, శ్రీశైలం, వికారాబాద్, హైదరాబాద్ తదితర లొకేషన్స్ లో ఈ మూవీ చిత్రీకరణ జరుపుకోవడంతో ఒక స్పెషల్ సాంగ్ మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఐటమ్ సాంగ్ కోసం సెట్ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.

కథ విషయానికి వస్తే.. ఇది కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం. లవ్, సెంటిమెంట్, కామెడీ, హార్రర్, థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను థ్రిల్ తో పాటు చక్కటి సందేశం ఇస్తుందని తెలిపారు. 

సాంకేతిక నిపుణులు:

సినిమాటోగ్రఫీ: డి.యాదగిరి

ఎడిటర్: సునీల్ మహారణ

సంగీతం: యు.వి.నిరంజన్

నిర్మాత: కొమారి జానయ్య నాయుడు

కథ- మాటలు -స్క్రీన్ ప్లే - దర్శకత్వం: కొమారి జానకిరామ్

పిఆర్ఓ: మధు.విఆర్

Sponsored links

TholuBommala Sitralu Banner Movie Latest Update:

TholuBommala Sitralu Banner Movie Shooting Completed

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019