Advertisement

‘ప్రతిరోజూ పండగే’ ట్రైలర్‌కు మెగామదర్ టచ్

Chiranjeevi Mother Anjana Devi Launches Prathi Roju Pandage Movie Trailer

Thu 05th Dec 2019 10:16 PM
chiranjeevi,mother,anjana devi,prathi roju pandage,movie,trailer,launch  ‘ప్రతిరోజూ పండగే’ ట్రైలర్‌కు మెగామదర్ టచ్
Chiranjeevi Mother Anjana Devi Launches Prathi Roju Pandage Movie Trailer ‘ప్రతిరోజూ పండగే’ ట్రైలర్‌కు మెగామదర్ టచ్
Advertisement

చిరంజీవి గారి తల్లి అంజనాదేవి గారి చేతుల మీదుగా  ప్రతిరోజు పండగే ట్రైలర్ విడుదల

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటిస్తోన్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. సత్యరాజ్, రావు రమేష్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్ర ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి విడుదల చేశారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా రావు రమేష్ మాట్లాడుతూ...

అల్లు అరవింద్ గారు ఈ కథ సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేసిన కథ కావడంతో నాకు ఈ సినిమాపై నమ్మకం పెరిగింది. యు.వి క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ వంటి పెద్ద బ్యానర్లు కలిసి చేసిన సినిమా కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. సెకండ్ హాఫ్ లో ఈ సినిమాలోని రెండు సీన్స్ ను మారుతి గారు ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. థియేటర్స్ లో మాత్రమే చూడదగ్గ సినిమా ఇది. మూవీ చూస్తున్న ఆడియన్స్ నవ్వుతూనే ఉంటారు. ఈ చిత్రం పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాట్లాడుతూ...

ఈ సినిమా సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు అందరూ ఎమోషనల్ ఫీల్ అయ్యారు. మారుతి సినిమాలో కొన్ని సీన్స్ లో విపరీతంగా నవ్వించాడు. తేజ్ నాకు బ్రదర్ లాంటివాడు, మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా రాబోతున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు.

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ...

ట్రైలర్ చూసిన అందరూ బాగుందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. నాకు సపోర్ట్ చేసిన నా టీమ్ కు గీతా, యూవీ బ్యానర్స్ కు థాంక్స్. ఈ కథ ముందుగా దిల్ రాజుకు చెప్పినప్పుడు ఆయన సబ్జెక్ట్ బాగుందని ఎంకరేజ్ చేశారు. తేజ్ ఈ కథ చెప్పిన వెంటనే ఒప్పుకున్నాడు. సినిమాలో నటించిన అందరూ బాగా చేశారు. సత్యరాజ్ గారు కథ విని ఎన్నిరోజులు కావాలంటే అన్నిరోజులు ఈ సినిమాకు వర్క్ చేస్తాను అన్నారు. రావ్ రమేష్ గారి పాత్ర గుర్తుండి పోతుంది. తండ్రిగా, కొడుగ్గా వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటించారు. అంజనాదేవి గారు మా చిత్ర ట్రైలర్ లాంచ్ చెయ్యడం అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తున్న బన్నీ గారికి స్పెషల్ థాంక్స్ తెలిపారు.

బన్నీవాసు మాట్లాడుతూ...

ఈ కథను విని నమ్మి ఒప్పుకున్నందుకు ధన్వవాదాలు. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడతాను. మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నానని ఇప్పుడు చెప్పగలనని అన్నారు.

రాశిఖన్నా మాట్లాడుతూ...

హ్యాపిగా ఉంది. ట్రైలర్ అందరికి నచ్చింది. నాకోసం మంచి పాత్ర రాసిన మారుతి గారికి థాంక్స్. నాకు సపోర్ట్ చేస్తున్న తేజ్ గారికి స్పెషల్ థాంక్స్. రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. అందరికి నచ్చే సినిమా ఇది అవుతుందని నమ్ముతున్నాను అన్నారు. 

అల్లు అరవింద్ మాట్లాడుతూ...

ఈ సినిమాను థియేటర్ లో ఫ్యామిలీ అందరితో పాటు చూస్తే వచ్చే ఆనందం వేరు. మారుతి ఈ సినిమాను చాలా ఎంటర్‌టైనర్ గా తీర్చిదిద్దాడు, ఆడియన్స్ దానికి కనెక్ట్ అవుతారు. అంజనాదేవి గారు మా ట్రైలర్ విడుదల చెయ్యడం సంతోషం. తేజ్ సినిమా చేస్తున్నప్పుడు ఇతర పాత్రలకు ప్రాధాన్యం ఇస్తారు. చిరంజీవి గారి దగ్గర ఉన్న ఈ లక్షణం తేజ్ లో ఉండడం విశేషం అన్నారు. 

సాయి తేజ్ మాట్లాడుతూ...

చిత్రాలహరి సినిమాతో నా సెకండ్ కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటినుండి మీకు అన్ని మంచి సినిమాలే ఇస్తాను. మా సినిమా ఇంత బాగా వచ్చిందంటే కారణం మా టీమ్, సో మా యూనిట్ సభ్యులకు థాంక్స్ తెలుపుతున్నాను. మారుతి గారు మాతో మంచి ఫీల్ గుడ్ సినిమా చేయించారు. గీతా ఆర్ట్స్, యూవీ బ్యానర్స్ లో వర్క్ చెయ్యడం మర్చిపోలేని అనుభూతి అన్నారు.

Chiranjeevi Mother Anjana Devi Launches Prathi Roju Pandage Movie Trailer:

Prathi Roju Pandage Movie Trailer Launch Event details


Loading..
Loading..
Loading..
advertisement