‘ట‌క్ జ‌గ‌దీష్‌’గా నేచురల్ స్టార్

Wed 04th Dec 2019 07:58 AM
hero nani,tuck jagadish,title,poster,release  ‘ట‌క్ జ‌గ‌దీష్‌’గా నేచురల్ స్టార్
Nani Tuck Jagadish Title Poster ‘ట‌క్ జ‌గ‌దీష్‌’గా నేచురల్ స్టార్
Sponsored links

నేచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వాణ సినిమా ‘ట‌క్ జ‌గ‌దీష్‌’

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా, శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న చిత్రానికి ‘ట‌క్‌ జ‌గ‌దీష్‌’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. నాని న‌టిస్తున్న 26వ చిత్రమిది. ‘నిన్నుకోరి’ వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘ట‌క్ జ‌గ‌దీష్‌.’ షైన్ స్క్రీన్స్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ ఏడాది ‘మ‌జిలీ’ వంటి సూప‌ర్ హిట్‌ను అందుకున్న‌ డైరెక్ట‌ర్ శివ నిర్వాణ ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా అన్ని హంగుల‌తో ప‌ర్‌ఫెక్ట్ స్క్రిప్ట్‌తో ‘ట‌క్ జ‌గ‌దీష్‌’ రూపొందించ‌నున్నారు. ఈ సినిమా టైటిల్ లుక్‌ను విడుద‌ల చేశారు. ఇందులో పంట‌పొలాలు, విండ్ మిల్స్ బ్యాంక్‌గ్రౌండ్‌లో నాని ప‌ల్లెటూరి యువ‌కుడిగా క‌న‌ప‌డుతున్నారు.  

‘ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం’ త‌ర్వాత నాని స‌ర‌స‌న రీతూవ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. అలాగే ‘కౌస‌ల్య‌కృష్ణ‌మూర్తి’ ఫేమ్ ఐశ్వ‌ర్యా రాజేష్ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. 2020 ప్ర‌థ‌మార్థంలో సినిమా రెగ్యుల‌ర్‌ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ప్ర‌సాద్ మూరెళ్ళ సినిమాటోగ్ర‌ఫీ, మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

న‌టీనటులు:

నేచుర‌ల్ స్టార్ నాని, రీతూవ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  శివ నిర్వాణ‌

నిర్మాత‌లు:  సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది

మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌

సినిమాటోగ్రఫీ: ప‌్ర‌సాద్ మూరెళ్ళ‌

ఎడిట‌ర్‌:  ప్ర‌వీణ్ పూడి

ఆర్ట్‌:  సాహి సురేష్

ఫైట్స్‌:  వెంక‌ట్‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  ఎస్‌.వెంక‌ట‌ర‌త్నం(వెంక‌ట్‌)

కో డైరెక్ట‌ర్‌:  ల‌క్ష్మణ్ ముసులూరి

పి.ఆర్‌.ఒ:  వంశీ శేఖ‌ర్‌

ప‌బ్లిసిటీ డిజైనర్‌:  శివ కిర‌ణ్‌(వ‌ర్కింగ్ టైటిల్‌)

కాస్ట్యూమ్ డిజైన‌ర్‌:  నీర‌జ్ కోన‌ 

Sponsored links

Nani Tuck Jagadish Title Poster:

Tuck Jagadish Poster: Nani The Village Guy  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019