అఖిల్‌తో పూజ ఎలా ఉంది!!

Tue 03rd Dec 2019 05:15 PM
akkineni akhil,pooja hegde,pooja new movie,bommarillu bhaskar  అఖిల్‌తో పూజ ఎలా ఉంది!!
How Is Pooja Hegde With Akhil! అఖిల్‌తో పూజ ఎలా ఉంది!!
Sponsored links

ప్రస్తుతం టాలీవుడ్ హీరోస్‌తో ఓ ఆటాడుకుంటున్న పూజ హెగ్డే‌కి చిన్న హీరో లేదు పెద్ద హీరో లేదు. తనకి ఎక్కడ బాగా గిట్టుబాటు అవుతుందో అక్కడ అవకాశం పట్టేస్తోంది. తాజాగా మహేష్, ఎన్టీఆర్‌లతో చుట్టేసిన పూజ హెగ్డే ఇప్పుడు అల్లు అర్జున్‌తో ‘అల వైకుంఠపురములో..’ సినిమా షూటింగ్‌కి త్వరలో ప్యాకప్ చెప్పేయనుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘జాన్’ తో మల్లి సెట్స్ మేడకేల్లబోతున్న పూజ, వరుణ్‌తో వాల్మీకి అంటూ అదరగొట్టేసింది. పూజ హెగ్డే ఇప్పుడు అఖిల్‌తో ప్రయాణం మొదలెట్టీసింది. బొమ్మరిల్లు భాస్కర్‌తో అఖిల్ చేస్తున్న నాలుగో సినిమాలో పూజ హీరోయిన్. అయితే షూటింగ్ మొదలైనప్పుడు పూజ హెగ్డే సెట్స్‌లో అడుగుపెట్టే వీడియో ఒకటి తెగ వైరల్ అయ్యింది. అప్పటినుండి ఇప్పటివరకూ #అఖిల్4 విషయాలేమి బయటికి రాలేదు.

కానీ తాజాగా అఖిల్‌తో పూజ హెగ్డే పిక్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. పూజ హెగ్డే చీరలో జడవేసుకుని ట్రెడిషనల్‌గా ఉండగా.. అఖిల్ మాత్రం డిజైనర్ డ్రెస్‌తో క్లాసీగా కనిపిస్తున్నాడు. ఇక పూజ హెగ్డే తన ఫోన్‌లో అఖిల్‌తో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పూజ హెగ్డే ట్రెడిషనల్‌గా, అఖిల్ కూడా ట్రెడిషనల్ వేర్‌లో కనిపిస్తున్నారు అంటే.. వీళ్ళ కేరెక్టర్స్ సినిమాలో ఎలా ఉండబోతున్నాయి..? అనే క్యూరియాసిటీ అక్కినేని ఫాన్స్‌లో మొదలైంది. అలాగే వీరిద్దరూ సాంప్రదాయంగా ఉన్నారు అంటే.. సినిమాలో ఏ పెళ్లి సీన్ షూట్ చేస్తున్నారేమో అంటున్నారు. మరి బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా నచ్చే సినిమాలు కావడంతో అఖిల్ - పూజలు కూడా ట్రెడిషన్‌గా క్లాసీ లుక్‌లోనే సినిమా ఉండబోతున్నారనే డౌట్ కొడుతోంది.

Sponsored links

How Is Pooja Hegde With Akhil!:

How Is Pooja Hegde With Akhil!  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019