రాయ్‌ల‌క్ష్మి ‘సిండ్రెల్లా’ టీజ‌ర్ విడుద‌ల‌

Rai Laxmi ‘Cinderella’ Telugu Teaser Outs

Mon 02nd Dec 2019 05:54 AM
rai laxmi,cinderella,telugu teaser,vinoo venketesh  రాయ్‌ల‌క్ష్మి ‘సిండ్రెల్లా’ టీజ‌ర్ విడుద‌ల‌
Rai Laxmi ‘Cinderella’ Telugu Teaser Outs రాయ్‌ల‌క్ష్మి ‘సిండ్రెల్లా’ టీజ‌ర్ విడుద‌ల‌
Advertisement

ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్న గ్లామ‌ర్‌డాల్ రాయ్‌ల‌క్ష్మి ద్విపాత్రాభిన‌యం చేసిన చిత్రం ‘సిండ్రెల్లా’. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన ఈ చిత్రాన్ని మ‌ల్టీ కల‌ర్‌ ఫ్రేమ్స్, ఎస్‌ఎస్‌ఐ ప్రొడ‌క్షన్‌ బ్యాన‌ర్స్‌పై తెలుగులో మంచాల ర‌వికిర‌ణ్ ‘సిండ్రెల్లా’ పేరుతోనే ప్రేక్షకుల‌కు అందిస్తున్నారు. ఎంఎన్‌ రాజు ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌. ఎస్‌.జె.సూర్య ద‌గ్గర ద‌ర్శక‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన విను వెంక‌టేశ్ ఈ చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హించారు. ఈ సినిమా టీజ‌ర్‌ను ఆదివారం విడుద‌ల చేశారు. హార‌ర్ ఫాంట‌సీ, మ‌ర్డర్ మిస్టరీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా టీజ‌ర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

‘స‌ర్కార్ 3’, ‘కిల్లింగ్ వీర‌ప్పన్’ చిత్రాల‌కు కెమెరామెన్‌గా వ‌ర్క్ చేసిన ర‌మ్మీ ఈ సినిమా సినిమాటోగ్రఫీ అందించారు. ‘కాంచ‌న 2’ చిత్రానికి సంగీతాన్ని అందించిన అశ్వామిత్ర ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అలాగే గేమ్ ఓవ‌ర్ చిత్రానికి సౌండ్ డిజైన్ చేసిన స‌చిన్ ఈ చిత్రానికి చేసిన సౌండ్ డిజైనింగ్ హైలైట్ కానుంది. త్వర‌లోనే ఈ సినిమాను తెలుగులో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని నిర్మాత‌ మంచాల ర‌వికిర‌ణ్‌, స‌హ నిర్మాత‌ ఎం.ఎన్‌.రాజు తెలిపారు.

న‌టీన‌టులు:-

రాయ్ ల‌క్ష్మి, రోబో శంక‌ర్‌, అభిన‌య‌, అర‌వింద్ ఆకాశ్‌, సాక్షి అగ‌ర్వాల్‌, వినోద్‌, అన్బు త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:-

బ్యాన‌ర్‌:  మ‌ల్టీ క‌ల‌ర్ ఫ్రేమ్స్‌

ర‌చ‌న‌, ద‌ర్శక‌త్వం:  విను వెంక‌టేశ్‌

నిర్మాత‌: మంచాల ర‌వికిర‌ణ్‌

కో ప్రొడ్యూస‌ర్‌: ఎం.ఎన్‌.రాజు

సినిమాటోగ్రాఫ‌ర్‌: ర‌మ్మీ

మ్యూజిక్‌: అశ్వామిత్ర

సౌండ్ డిజైనింగ్‌: స‌చిన్‌(సింక్ సినిమాస్‌)

ఎడిట‌ర్‌: లారెన్స్ కిషోర్‌.

Rai Laxmi ‘Cinderella’ Telugu Teaser Outs:

Rai Laxmi ‘Cinderella’ Telugu Teaser Outs


Loading..
Loading..
Loading..
advertisement