నానికి ఇద్దరు హీరోయిన్లు ఫిక్సయ్యారోచ్!

Sun 01st Dec 2019 05:38 PM
natural star new movie,hero nani,two heroines,aishwarya rajesh,reethu varma  నానికి ఇద్దరు హీరోయిన్లు ఫిక్సయ్యారోచ్!
Two Heroine Fixed For Nani New Movie నానికి ఇద్దరు హీరోయిన్లు ఫిక్సయ్యారోచ్!
Advertisement
Ads by CJ

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ ద‌ర్శక‌త్వంలో కొత్త చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది కలిసి ఈ చిత్రాన్ని కాస్త ఎక్కువ బడ్జెట్‌లోనే నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నారు. అయితే నాని సరసన నటించే ముద్దుగుమ్మల కోసం గత కొన్ని రోజులుగా దర్శకనిర్మాతలు వేట సాగిస్తున్నారట. ఒకరు కాదు ఇద్దరు హీరోయిన్లు తీసుకుంటున్నారట. ఫ్లాష్ బ్యాక్‌లో ఒక హీరోయిన్.. నార్మల్ స్టోరీకి ఓ హీరోయిన్‌ను తీసుకుంటున్నారని టాక్. నానికి మొదటి హీరోయిన్‌గా ‘పెళ్లి చూపులు’ సినిమాతో ఫర్లేదు అనిపించుకున్న రీతూ వర్మను తీసుకుంటున్నారట. ఇక రెండో హీరోయిన్‌గా ఎవర్ని తీసుకుందామా..? అని డైరెక్టర్ మళ్లీ ఆలోచనలో పడ్డారట.

అయితే.. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో వెతికి వెతికి మరీ.. ఐశ్వర్య రాజేశ్‌ను ఫైనల్ చేశారట. తమిళ్‌లో వరుస అవకాశాలను ఆ భామ బిజిబిజీగా గడుపుతోంది. ఇక తెలుగు విషయానికొస్తే.. ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాలో ఆమె నటనకు కుర్రకారు ఫిదా అయిపోయారు. అలా ఆమె తెలుగులో బాగానే ఫాలోయింగ్ పెంచుకుంది. అందుకే ఐశ్వర్య అయితే సరిగ్గా సెట్ అవుతుందని భావించి ఫిక్సయ్యారట. నాని సరసన నటించడానికి కూడా ఆ ముద్దుగుమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఇక అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే అధికారిక ప్రకటన చేసి.. సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చిత్రబృందం భావిస్తోందట. సో ఇదే నిజమైతే ఐశ్వర్య తెలుగులో స్పీడ్ పెంచేసినట్లే మరి.

Two Heroine Fixed For Nani New Movie:

Two Heroine Fixed For Nani New Movie  

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ