వెటర్నరీ వైద్యురాలిని కొందరు మానవమృగాలు అత్యాచారం చేసి ఆపై.. సజీవ దహనం చేసి దారుణంగా హత్యచేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనతో జనాలు ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే తెలంగాణ మంత్రి కేటీఆర్, సీపీ సజ్జనార్, షీ టీమ్ స్పందించింది. టాలీవుడ్‌కు చెందిన అనుష్క, కీర్తి సురేష్, పూనమ్ కౌర్, కార్తికేయతో పాటు పలువురు నటులు, నటీమణులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆక్రోశాన్ని వెల్లగక్కారు. అయితే తాజాగా మరోసారి ఫేస్‌బుక్ వేదికగా ఓ వీడియోను పూనమ్ కౌర్ విడుదల చేసింది.అసహ్యంగా ఉంది!
ఇప్పటికే రియాక్షన్..!
‘ డాక్టర్ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫోన్ చేయగా.. మీ కుమార్తె ఎవరితోనో వెళ్లిపోయుంటుందేమో అని పోలీసులు చులకనగా మాట్లాడినట్టు తెలిసింది. ఆపదలో ఉన్న ఓ అమ్మాయిని లేచిపోయిందేమో అనడానికి పోలీసులకు సిగ్గు లేదా?. అసహ్యంగా ఉంది, పోలీసుల తీరు మర్యాదకరం అనిపించుకోదు’ అని పూనమ్ కౌర్ తీవ్ర ఆగ్రహానికి లోనైంది. అయితే పోలీసులు నిజంగానే ఇలా రియాక్ట్ అయ్యారా లేకుంటే ఇదంతా ఫేకా అనేదానిపై ఖాకీలు రియాక్ట్ కావాల్సిన ఎంతైనా ఉంది.
పూనమ్ తాజా వీడియో..
బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించినప్పుడు ఎవరితోనైనా లేచిపోయిందేమో అని అనడానికి ఆ పోలీసు అధికారికి సిగ్గులేదా? అని ఖాకీల తీరుపై మరోసారి ఆమె తీవ్ర ఆగ్రహం వ్కయక్తం చేసింది. ఓ మహిళ సాయం కోసం నడి రోడ్డుపై ఎదురుచూస్తుంటే ఆ నలుగురు ***లు ఆమెకు మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లి రేప్ చేసి నిప్పు పెట్టి చంపేశారని భావోద్వేగాని లోనయ్యింది. ఆ జంతువులను చంపి జైలుకి వెళ్లాలని ఉందని.. జైలు శిక్ష అనుభవించడం కాదు.. కావాలంటే తానే వారిని చంపి జైలుకి వెళ్తానని తన ఆక్రోశాన్ని ఆమె బయటపెట్టింది.
నిందితుల్లో ఒకడు ముస్లీం కావడంతో వివాదం రేగుతోందని.. మతం గురించి కాదని.. అసలు మనం అడవుల్లో ఉంటున్నామా? అని ఆమె ప్రశ్నించింది. అంతటితో ఆగని పూనమ్.. అడవుల్లో అయినా కాస్త మేలేమో.. కానీ మనుషుల బుర్రలు మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఈ రేప్ సంఘటనలతో తాను విసిగిపోయానని.. ఆ నలుగురు ల***లను చంపేయాలని ఉందని కన్నెర్రజేసింది. రేపిస్ట్‌లను చంపడం నేరమైతే తాను చేయడానికి సిద్ధమేనని ఫేస్‌బుక్ వీడియోలో పూనం తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయింది.