ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Actress Charmme kaur re tweet on one of her fan dance video

‘సిలక.. సిలక..’ కుర్రాడితో డ్యాన్స్ చేస్తా: చార్మీ

Actress Charmme kaur re tweet on one of her fan dance videoActress Charmme kaur re tweet on one of her fan dance video

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. నిధి అగర్వాల్, నభా నటేష్ నటీనటులుగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం విదితమే. ఈ సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో.. కలెక్షన్ల వర్షం ఎలా కురిపించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అంతేకాదు.. సినిమాను రెండోసారి రిలీజ్ చేసేంత పరిస్థితి వచ్చిందంటే ‘ఇస్మార్ట్ శంకర్’ జనాలకు ఏ రేంజ్‌లో ఎక్కిందో అర్థం చేసుకోవచ్చు. ఇక సాంగ్స్ విషయానికొస్తే.. ఏ పెళ్లిలో చూసినా ఇవే.. ఏ ఫంక్షన్లలో చూసినా ఇవే.

ఇక అసలు విషయానికొస్తే.. ఇటీవల ఓ యువకుడు ‘సిలక.. సిలక..’ అనే సాంగ్‌కు డ్యాన్స్ ఇరగదీశాడు. ఆ వీడియోను నెట్టింట్లో పోస్ట్ చేశాడు. అంతేకాదు ఆ వీడియోను చార్మీ, పూరీ, నిధి అగర్వాల్‌తో పాటు పలువురికి ట్యాగ్ చేశాడు. నిజంగా ఆ వీడియోలో డ్యాన్స్ మాత్రం కుర్రాడు ఇరదీశాడు.. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ మాత్రం ట్రైనింగ్ లేకుండానే ఆ రేంజ్‌లో డ్యాన్స్ చేశాడంటే కాస్త శిక్షణ ఉండుంటే బాక్స్‌లు బద్ధలయ్యేవేమో. ఈ వీడియో చూసిన చార్మీ ఫిదా అయిపోయింది. 

వాస్తవానికి కెరీర్ ప్రారంభం నుంచి ఛార్మికి డాన్సర్‌గా మంచి గుర్తింపే ఉందన్న విషయం తెలిసిందే. అయితే ఆ కుర్రాడి డ్యాన్స్ వీడియోను తిలకించిన చార్మీ.. అనంతరం ఆ హాట్ బ్యూటీనే ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ఆ కుర్రాడిపై చార్మీ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ‘వావ్.. అమేజింగ్ మ్యాన్.. సో.. చార్మింగ్.. నేను కానీ అక్కడే ఉండుంటే కచ్చితంగా డ్యాన్స్ చేసుండే దాన్ని’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చింది. ఈ ట్వీట్‌కు పలువురు చార్మి అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Actress Charmme kaur re tweet on one of her fan dance video

actress charmme kaur
dance
fan dance video
silaka silaka song