Advertisement

ప్రభాస్-పూజా మూవీపై ఇంట్రస్టింగ్ అప్డేట్స్!

Fri 29th Nov 2019 08:10 PM
young rebal star prabhas,pooja hegde,john movie,interesting update  ప్రభాస్-పూజా మూవీపై ఇంట్రస్టింగ్ అప్డేట్స్!
Prabhas- Pooja Hegde Movie Interesting Update ప్రభాస్-పూజా మూవీపై ఇంట్రస్టింగ్ అప్డేట్స్!
Advertisement

బాహుబలి’ సినిమా సూపర్ డూపర్ హిట్టవడంతో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతోంది. అయితే ‘సాహో’ చిత్రంతో ఆ పేరు మరింత మార్మోగుతుందని ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్తుందని భావించినప్పటికీ ఆశించిన రీతిలో ఆడలేదు. దీంతో ఇక భారీ సినిమాలు కాకుండా చిన్న సినిమాలే అయినా బాక్సాఫీస్‌ను షేక్ చేసే రీతిలో ఉండాలని రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. 

ఈ సినిమాకి ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ ‘జాన్’గా పెట్టారు. ఈ సినిమాపై డార్లింగ్ ప్రత్యేక దృష్టి పెట్టాడట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒకటి, అర అప్డేట్స్ అందాయి. అయితే సినిమా ఎలా ఉంటుంది..? ఏ జోనర్‌లో తెరకెక్కుతోంది..? అని అప్డేట్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అనుకున్నట్లుగానే డార్లింగ్ ఫ్యాన్స్‌కు ఓ సర్‌ఫ్రైజింగ్ అప్డేట్ నెట్టింట్లో షికారు చేస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ డబుల్ రోల్‌లో నటిస్తున్నాడట అనేది ఆ అప్డేట్ సారాంశం. అంతేకాదండోయ్.. ఇందులో ఒక పాత్ర ఓల్డ్ గెటప్‌లో.. మరోటి యంగ్ గెటప్ ఉంటుందట. ఇందులో ఓ పాత్రలో అత్యంత ధనవంతుడిగా ప్రభాస్ కనిపిస్తాడట. అలాగే పేదింటి అమ్మాయి ప్రేమలో పడి.. ఆమె కోసం సర్వం కోల్పోయి .. ప్రేమలో గెలవడానికి అన్నీ వదిలేస్తాడని సమాచారం.

1960 కాలంలో ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అప్డేట్స్ ఫిల్మ్ నగర్‌లో పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తున్నాయి. కాగా.. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దే నటిస్తోంది. ఇటీవల ఈ భామ షూటింగ్ నిమిత్తం అమెరికా వెళ్లింది. ప్రభాస్ నిజమైన ఇంటర్నేషనల్ స్టార్ అని.. తాను చూసిన వ్యక్తుల్లో ప్రభాస్ చాలా మంచి వ్యక్తి అని డార్లింగ్‌ను ఈ పూజా పాప ఆకాశానికెత్తేసిన విషయం విదితమే. మరి ప్రభాస్ రోల్స్, సినిమా గురించి వస్తున్న పుకార్లు ఏ మాత్రం నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన లేదా సినిమా రిలీజ్ అయ్యేంత వరకూ వేచి చూడాల్సిందే.

Prabhas- Pooja Hegde Movie Interesting Update:

Prabhas- Pooja Hegde Movie Interesting Update  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement