Advertisement

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ విడుదల తేదీ ఫిక్స్

Sat 23rd Nov 2019 08:59 PM
kamma rajyamlo kadapa reddlu,release,november 29  ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ విడుదల తేదీ ఫిక్స్
Kamma Rajyamlo Kadapa Reddlu Release Date fixed ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ విడుదల తేదీ ఫిక్స్
Advertisement

ఈ నెల 29న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు విడుదల 

రాంగోపాల్ వర్మ తన టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై అందిస్తున్న తాజా సంచలన చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. సిద్దార్థ తాతోలు దర్శకత్వం వహించారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని ఈ  నెల 29న  విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియచేస్తూ... 800 థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నామని తెలిపింది. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్స్ కు, సాంగ్స్ కు, విశేషమైన ఆదరణ లభించిందని తెలిపింది. అలాగే పప్పు లాంటి అబ్బాయి పాట కూడా అశేష ప్రేక్షక వాహిని ఆదరణతో ట్రెండింగ్ అయ్యిందని  చిత్రబృందం వెల్లడించింది. ఏ వర్గాలను టార్గెట్ చేసి ఈ చిత్రం తీయలేదని... ప్యాక్షనిజం, రౌడీయిజమ్, రాజకీయ నేపద్యాలలో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రమిదని స్ప్రష్టం చేసింది. ఇందులోని  ఏడు పాటలు ఏ పాటకు ఆ పాట హైలెట్ గా ఉంటుందని వివరించింది. టి.అంజ‌య్య స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ, నిర్మాతలు: అజయ్ మైసూర్, టి. న‌రేష్‌కుమార్‌, టి. శ్రీ‌ధర్. 

Kamma Rajyamlo Kadapa Reddlu Release Date fixed:

Kamma Rajyamlo Kadapa Reddlu Release on Nov 29

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement