‘తూటా’ రిలీజ్ డేట్ ఫిక్సయింది

నవంబర్ 29న విడుదల కానున్న ధనుష్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మేఘా ఆకాష్ తూటా..

హీరో ధనుష్, దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ తొలిసారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎనై నోకి పాయుమ్ తోట. ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో తూటా పేరుతో అనువదిస్తున్నారు. మేఘ ఆకాష్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఇందులో అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ కు దర్భుక శివ సంగీతం అందిస్తుండగా.. మనోజ్ పరమహంస, ఎస్ఆర్ కాథిర్, జామన్ టి జాన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్, టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తుంది. సినిమా నవంబర్ 29న భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. విజయభేరి వారి బ్యానర్ పై జి తాత రెడ్డి, జి సత్యనారాయణ రెడ్డి ఈ చిత్రం తెలుగు హక్కులను కొనుగోలు చేశారు.

నటీనటులు: ధనుష్, మేఘా ఆకాశ్

సాంకేతిక నిపుణులు:

రచన, దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ్ మీనన్

నిర్మాతలు: జి తాత రెడ్డి, జి సత్యనారాయణ రెడ్డి

సంగీతం: ధర్భుక శివ

సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, జామన్ టి జాన్, ఎస్ఆర్ కాథిర్

ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని

ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్

మాటలు: శశాంక్ వెన్నెలకంటి

లిరిక్స్: అనంత శ్రీరామ్, చైతన్య ప్రసాద్

పబ్లిసిటీ డిజైన్స్: విక్రమ్ డిజైన్స్

పిఆర్ఓ: వంశీ శేఖర్

Thoota Movie Release on Nov 29th

Dhanush Thoota Release Date Fixed
thoota
movie
release
november 29
Advertisement
Advertisement