‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్: సంక్రాంతికి మొగుడే!

Fri 22nd Nov 2019 10:14 PM
mahesh babu,sarileru neekevvaru,teaser,release  ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్: సంక్రాంతికి మొగుడే!
Sarileru Neekevvaru Movie Teaser Review ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్: సంక్రాంతికి మొగుడే!
Sponsored links

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహేష్ సరిలేరు నీకెవ్వరు టీజర్ చూస్తుంటే.. నిజంగానే సరిలేరు మహేష్‌కెవ్వరు అనిపిస్తుంది. గత రెండు రోజుల్లోగా సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ హంగామా  చూసిన ఎవ్వరికైనా సరిలేరు నీకెవ్వరు టీజర్ పై అమితాశక్తి రావడం ఖాయం. సరిలేరు నీకెవ్వరు టీజర్ రిలీజ్ కౌన్ డౌన్ ట్రేండింగ్ లో ఉంది అంటే.... మహేష్ సినిమా టీజర్ కోసం అభిమానులు ఎంతెలా ఎదురు చూస్తున్నారో తెలుస్తుంది. అనిల్ రావిపూడి మహేష్ ని ఎలా చూపించబోతున్నాడో అనే క్యూరియాసిటీకి బ్రేకులు పడిపోయాయి. మహేష్ ఎప్పటిలాగే స్టైలిష్ గా ఆర్మీ ఆఫీసర్ లుక్ లో ఇరగదీస్తున్నాడు. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా టీజర్ కూడా ఆర్మీ బ్యాక్ డ్రాప్ తోనే రిచ్ గా మొదలవుతుంది.

మహేష్ తన సైన్యాన్ని వేసుకుని.. బ్యాగ్రౌండ్ లో మీరెవరో మాకు తెలియదు, మీకు మాకు ఏ రక్త సంబంధము లేదు... కానీ మీ కోసం మీ పిల్లల కోసం పగలు రాత్రి, ఎండా వాన అని లేకుండా పోరాడుతూనే ఉంటాం.. ఎందుకంటే మీరు మా బాధ్యత అంటూ మహేష్ చెప్పే సుదీర్ఘ డైలాగ్ మహేష్ స్టైలిష్ లుక్, మహేష్ ఆర్మీ లుక్ అన్ని అదరగొట్టేలా ఉన్నాయి. ఇక మహేష్, విలన్ అజయ్ దగ్గర కూర్చుని మీరంతా నేను కాపాడుకునే ప్రాణాలురా... మిమ్మల్ని ఎలా చంపుకుంటాంరా.. మీ కోసం ప్రాణాలిస్తున్నాంరా అక్కడ... కానీ మీరేమో కత్తులు, గొడ్డళ్లు వేసుకుని ఆడాళ్ళ మీద... బాధ్యత ఉండక్కర్లా.. అంటూ చెప్పే కామెడీతో కూడిన వార్ణింగ్ బావుంది. విజయశాంతి రాయల్ లుక్, ప్రకాష్ రాజ్ పొలిటికల్ లుక్ తో పాటుగా మహేష్ యాక్షన్ సీన్స్ కూడా హైలెట్ అనేలా ఉన్నాయి. భయపడేవాడే బేరానికొస్తాడు, మనదగ్గర బేరాలేవమ్మా అంటూ మహేష్ అరిచే అరుపు కాస్త.. ఇబ్బందిగా అనిపించినా.. ప్రకాష్ రాజ్ టీజర్ చివర్లో చెప్పే ప్రతి సంక్రాంతికి అళ్లుల్లోస్తారు, ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు అంటూ చెప్పే ఇరిటేటింగ్ డైలాగ్ మాత్రం అదుర్స్. మరి అనిల్ రావిపూడి గత సంక్రాంతిలా కామెడి  అల్లుళ్ళని దింపకుండా....ఏకంగా అందరిని గడగడలాడించే మొగుణ్ణే దింపుతున్నాడన్నమాట.

Click Here For Teaser

Sponsored links

Sarileru Neekevvaru Movie Teaser Review:

Sarileru Neekevvaru Teaser Released

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019