‘పిజ్జా 2’తో వస్తున్నాడు

Thu 21st Nov 2019 10:02 PM
pizza 2,movie,latest,update  ‘పిజ్జా 2’తో వస్తున్నాడు
Vijay Sethupathi Pizza 2 Movie Ready to Release ‘పిజ్జా 2’తో వస్తున్నాడు
Sponsored links

డిసెంబర్ మొదటి వారంలో విడుదలవుతున్న విజయ్ సేతుపతి ‘పిజ్జా 2’

విజయ్ సేతుపతి, గాయత్రి హీరోహీరోయిన్లుగా తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘పురియత్ పుధీర్’. తమిళంలో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని ‘పిజ్జా 2’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. గతంలో విజయ్ సేతుపతి నటించిన ‘పిజ్జా’ చిత్రం తెలుగులో మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు తెలుగులో ‘పిజ్జా 2’ గా టైటిల్ ఖరారు చేశారు. డి.వి.సినీ క్రియేష‌న్స్ మరియు లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్ బ్యాన‌ర్‌పై  ఉదయ్ హర్ష వడ్డేల్ల, డి.వి.వెంక‌టేష్ సంయుక్తంగా డిసెంబర్ మొదటి వారంలో ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కులకు అందిస్తున్నారు.

ఆధునిక టెక్నాలజీ పేరుతో కొందరు యువకులు అమాయక మహిళలను ఎలా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారో తెలిపే ఒక సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసుకుని థ్రిల్లర్ జోనర్‌లో ఈ సినిమా రూపొందించబడింది. ఆద్యంతం ఉత్కంఠతో నడుస్తూ ఆసక్తిని కలిగించే స్క్రీన్‌ప్లేతో సాగే ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ని దర్శకుడు రంజిత్ జయకోడి తెరకెక్కించారు. ఈ చిత్రంలో నేరం ఫేమ్ రమేష్ తిలక్, సోనియా దీప్తి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

Sponsored links

Vijay Sethupathi Pizza 2 Movie Ready to Release:

Pizza 2 Movie Latest Update

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019