రూలర్ టీజర్: ‘సింహం’ డైలాగ్ చించేశాడు

Ruler Teaser Review

Thu 21st Nov 2019 08:35 PM
Advertisement
balakrishna,ruler,ks ravi kumar,teaser,release  రూలర్ టీజర్: ‘సింహం’ డైలాగ్ చించేశాడు
Ruler Teaser Review రూలర్ టీజర్: ‘సింహం’ డైలాగ్ చించేశాడు
Advertisement

డిసెంబర్ 20 న విడుదల కాబోతున్న కె ఎస్ రవికుమార్ - బాలకృష్ణల రూలర్ టీజర్ ని రేపు విడుదల చేస్తున్నామంటూ.. నిన్న రాత్రి పోస్టర్ వదిలిన చిత్ర బృందం.. ఈ రోజు ఉదయం నుండి రూలర్ టీజర్ కౌన్ డౌన్ వీడియోస్ తో పిచ్చెక్కించారు. ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్న వేదిక, సోనాల్ చౌహన్, దర్శకుడు రవికుమార్,  హీరో బాలకృష్ణలు రూలర్ టీజర్ ఇదిగో అదిగో అంటూ వీడియోస్ తో చేసిన హంగామాతో ఈ టీజర్ పై ప్రేక్షకుల్లో పిచ్చ ఆసక్తి క్రియేట్ అయ్యింది. ఇప్పటికే బాలకృష్ణ యంగ్ అండ్ ఎనర్జిటిక్ లుక్స్ తో షేక్ చేసిన చిత్ర బృందం ఇప్పుడు రూలర్ టీజర్ తోనూ కాక లేపి... డిసెంబర్ మూడో వారంలో విడుదల కాబోతున్న సినిమాకు హెచ్చరికలు జారీ చేసింది.

రూలర్ సినిమాలో పేరున్న నటులు నటించారు. ప్రకాష్ రాజ్, భూమిక, జయసుధ వంటి వారు సినిమాలో కనిపించడమే కాదు... రూలర్ టీజర్ లోను వారి పాత్రల తాలూకు పవర్ ఫుల్ లుక్స్ తో రివీల్ అయ్యాయి. ఇక బాలకృష్ణ లుక్స్, స్టైలిష్ యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీతో పాటుగా.. హీరోయిన్స్ గ్లామర్, ప్రకాష్ రాజ్ పాత్ర అన్ని సినిమాకి మెయిన్ హైలెట్ అనేలా టీజర్ కట్ చేసారు. ఇక బాలకృష్ణ పోలీస్ లుక్ లో ఒంటి మీద ఖాకి యూనిఫామ్ ఉంటేనే బోనులో పెట్టిన సింహంలా ఉంటాను .... యూనిఫామ్ తీసానా బయటికి వచ్చిన సింహంలా ఆగను...... ఇక వేటే.. అంటూ చెప్పిన డైలాగ్స్, ఆయన యాక్షన్ ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ... బాలకృష్ణ పోలీస్ లుక్ చూస్తే కాస్త కామెడీగా అనిపిస్తుంది. సూటు బాటులో చాలా స్టైలిష్ గా కనబడిన బాలయ్య... పోలీస్ లుక్ లో మాత్రం కళ్లకింద క్యారీ బ్యాగులతో... క్లోజప్ షాట్స్ లో వయసుమీరిన వ్యక్తిలా తేలిపోయాడు. ఏదైనా రూలర్ టీజర్ మాత్రం బాలయ్య ఫ్యాన్స్ అంచనాలు మించేలా కనబడుతుంది. 

Click Here For Teaser

Advertisement

Ruler Teaser Review:

Balayya Ruler Teaser Released

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement