సూరి ఆరోపణలపై ఎన్టీఆర్‌కు జక్కన్న సలహా!

Thu 21st Nov 2019 06:50 PM
jr ntr,ss rajamouli,suggestion,surender reddy,young tiger,allegations  సూరి ఆరోపణలపై ఎన్టీఆర్‌కు జక్కన్న సలహా!
Rajamouli Suggestion to Jr NTR on Surender Reddy Allegations సూరి ఆరోపణలపై ఎన్టీఆర్‌కు జక్కన్న సలహా!
Sponsored links

స్టార్ హీరో ఎన్టీఆర్ హిట్ డైరెక్టర్స్ వెంటపడి సినిమాలు చేస్తాడనే నానుడు ఆయన సింహాద్రి సినిమా చేసినప్పటి నుండి ఉంది. అయితే కళ్యాణ్ రామ్ కి అతనొక్కడే లాంటి హిట్ ఇచ్చిన సురేందర్ రెడ్డి తో ఎన్టీఆర్ అశోక్ అనే మాస్ సినిమా కోసం తన మేనేజర్ ని రంగంలోకి దింపి సురేందర్ రెడ్డి తో ఆ సినిమా చేసాడని తాజాగా సైరా తో హిట్ కొట్టిన సురేందర్ రెడ్డిపై ఆరోపిస్తున్నాడు. అశోక్ సినిమా డిజాస్టర్ గనక సురేందర్ రెడ్డి అలా మాట్లాడాడు. మరి అశోక్ సినిమాని బలవంతంగా చేయిస్తే.. తర్వాత ఎన్టీఆర్ అడిగితే ఊసరవెల్లి చేసి ఎన్టీఆర్‌కి మరో ప్లాప్ ఇచ్చాడా అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఎన్టీఆర్‌పై సురేందర్ రెడ్డి అలా అశోక్ సినిమాని బలవంతంగా చేపించారంటూ.. సంచలన వ్యాఖ్యలు చెయ్యడంతో... ఎన్టీఆర్ ఫ్యాన్స్ సురేందర్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారు.

ఇంత జరిగినా ఎన్టీఆర్ మాత్రం సురేందర్ రెడ్డి మాటలకు రియాక్ట్ కాలేదు. సురేందర్ రెడ్డికి ఎన్టీఆర్ కౌంటర్ ఇస్తాడేమో అంటూ అందరూ ఎదురు చూసారు. కానీ ఎన్టీఆర్ మాత్రం సైలెంట్ గా ఉండిపోయాడు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న RRR సెట్స్‌లో సురేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వాడివేడి చర్చ జరిగిందని, అయితే ఎన్టీఆర్‌ని కామ్‌గా ఉండిపొమ్మని రాజమౌళి ఎన్టీఆర్‌కి సలహా ఇచ్చాడని, కామ్ గా ఉంటే.. నీకేమంచిది అంటూ.. ఎన్టీఆర్ కి ఇష్టమైన దర్శకుడు జక్కన్న ఇచ్చిన సలహాతోనే ఎన్టీఆర్ కామ్ అయ్యాడనే టాక్ ఫిలింసర్కిల్స్‌లో వినబడుతుంది. 

Sponsored links

Rajamouli Suggestion to Jr NTR on Surender Reddy Allegations:

Jr NTR Takes SS Rajamouli Suggestion 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019