‘భాగ్య‌న‌గ‌ర వీధుల్లో గ‌మ్మ‌త్తు’ ట్రైల‌ర్ విడుదల

Bhagya Nagara Veedullo Gammathu Trailer Launched by VARUN TEJ

Thu 21st Nov 2019 05:31 PM
Advertisement
bhagya nagara veedullo gammathu,trailer release,varun tej,srinivasa reddy  ‘భాగ్య‌న‌గ‌ర వీధుల్లో గ‌మ్మ‌త్తు’ ట్రైల‌ర్ విడుదల
Bhagya Nagara Veedullo Gammathu Trailer Launched by VARUN TEJ ‘భాగ్య‌న‌గ‌ర వీధుల్లో గ‌మ్మ‌త్తు’ ట్రైల‌ర్ విడుదల
Advertisement

‘భాగ్య‌న‌గ‌ర వీధుల్లో గ‌మ్మ‌త్తు’ ట్రైల‌ర్ విడుద‌ల చేసిన వ‌రుణ్ తేజ్‌

ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస‌రెడ్డి, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘భాగ్య‌న‌గ‌ర‌ వీధుల్లో గ‌మ్మ‌త్తు’. ఈ చిత్రం ద్వారా క‌మెడియ‌న్‌, నటుడు వై.శ్రీనివాస్ రెడ్డి ద‌ర్శ‌క నిర్మాత‌గా మారుతున్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ట్రైల‌ర్‌ను బుధ‌వారం మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ విడుద‌ల చేశారు. సినిమా ట్రైల‌ర్ చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంది. సినిమా ఇంత‌కు మించి ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంద‌ని భావిస్తున్నాను. సినిమా చాలా పెద్ద హిట్ కావాలంటూ ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు వ‌రుణ్‌తేజ్‌. 

ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. డిసెంబ‌ర్ 6న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ‘జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా’ ర‌చ‌యిత ప‌రం సూర్యాన్షు ఈ సినిమాకు క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లేను అందించారు. 

న‌టీన‌టులు: శ్రీనివాస‌రెడ్డి, ష‌క‌ల‌క శంక‌ర్‌, స‌త్య‌, వెన్నెల‌కిషోర్, స‌త్యం రాజేశ్‌, ర‌ఘుబాబు, ప్ర‌వీణ్‌ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

నిర్మాత‌, ద‌ర్శ‌క‌త్వం: వై.శ్రీనివాస‌రెడ్డి

క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే: ప‌ర‌మ్ సూర్యాన్షు

మ్యూజిక్‌: సాకేత్ కొమండూరి

సినిమాటోగ్ర‌ఫీ: భ‌ర‌ణి కె.ధ‌ర‌ణ్‌

ఎడిట‌ర్‌: అవుల వెంక‌టేశ్

ఆర్ట్‌: ర‌ఘు కుల‌క‌ర్ణి

లైన్ ప్రొడ్యూస‌ర్‌: చిత్రం శ్రీను

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ధ‌నుంజ‌య కుమార్‌

ఎగ్జిక్యూష‌న్‌: నారాయ‌ణ జంప‌

పి.ఆర్‌.ఓ: వంశీ కాక‌

Advertisement

Bhagya Nagara Veedullo Gammathu Trailer Launched by VARUN TEJ:

Bhagya Nagara Veedullo Gammathu Trailer Released

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement