ప్రభాస్‌లో ఏం మార్పు రాలేదుగా..?

Wed 20th Nov 2019 02:14 PM
prabhas,no change,physic,lakshman,son,engagement  ప్రభాస్‌లో ఏం మార్పు రాలేదుగా..?
No Change in Young Rebel Star Prabhas Physic ప్రభాస్‌లో ఏం మార్పు రాలేదుగా..?
Sponsored links

బాహుబలి తర్వాత సాహో కోసం ప్రభాస్ కాస్త వెయిట్ తగ్గడానికి అమెరికా వరకు వెళ్ళొచ్చాడు. అయితే సాహో సినిమాలో కొన్ని షాట్స్ లో ఫిట్ గా కనబడినా... సినిమాలో అధిక శాతం బరువుతోనే ఉన్నాడు. లుక్స్ కూడా ఏజెడ్ పర్సన్ లా కనిపించాయి. ప్రభాస్ హిట్ కి తగ్గ వెయిట్ కాకుండా కాస్త లావుగా కనిపించాడు. సాహోలో ప్రభాస్ లుక్ మీద చాలానే వార్తలొచ్చాయి. అయితే సాహో సినిమా పోవడంతో... తన తదుపరి చిత్రం జాన్ కోసం సాహో బాగా వర్కౌట్స్ గట్రా చేసి బాడీ తగ్గించుకోవాలని డిసైడ్ అయ్యాడన్నారు. అనడం కాదు ట్రైనర్లు ఆధ్వర్యంలో ప్రభాస్ చేసిన వర్కౌట్స్ ని ఫొటోస్ రూపంలో లీకు చేశారు. అబ్బ ప్రభాస్ బాడీ తగ్గించుకోవడానికి చాలా కష్టపడుతున్నాడనే అనుకున్నాం.

కానీ ప్రభాస్ మాత్రం అస్సలు వెయిట్ తగ్గలేదు. ఎందుకంటే తాజాగా ప్రభాస్ ఓ ప్రొడ్యూసర్ కొడుకు పెళ్లిలో ఎప్పటిలాగే బొద్దుగా కనిపించాడు. ఆ పెళ్ళిలో ప్రభాస్ స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపించినప్పటికీ... ప్రభాస్ లుక్ పై మళ్ళీ ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. మరీ ఇంత లావుగా అంటే... హీరోగా క్రేజ్ తగ్గుతుందంటున్నారు. ఇంకా ఆ పెళ్ళిలో విజయ్ దేవరకొండ, నమ్రత వంటి వారు హాజరైనా అందరి కళ్ళు బాహుబలి ప్రభాస్ మీదే ఉన్నాయి. మరి జాన్ కోసం ఒళ్ళు తగ్గించుకుంటున్నాడనుకంటే... ప్రభాస్ మాత్రం ఎప్పటిలాగే వెయిట్ తో కనబడడం చూసి ఆయన ఫ్యాన్స్ షాకవుతున్నారు. మరి ప్రభాస్ స్వతహాగా ఫుడీ. ఇలా తింటూ పోతే బాడీ షెపవుట్ అయ్యి.. మొదటికే మోసం వస్తుంది అంటూ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలయింది. 

Sponsored links

No Change in Young Rebel Star Prabhas Physic:

Prabhas at Lakshman Son Engagement

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019