మనల్ని మనం ప్రశ్నించుకునే చిత్రమిది: సాయితేజ్

Prathiroju Pandaage Movie Second Song Oo baava Released

Tue 19th Nov 2019 07:08 PM
Advertisement
prathiroju pandaage movie,second song,oo baava song,sai dharam tej,raashi khanna,maruthi,bunny vas  మనల్ని మనం ప్రశ్నించుకునే చిత్రమిది: సాయితేజ్
Prathiroju Pandaage Movie Second Song Oo baava Released మనల్ని మనం ప్రశ్నించుకునే చిత్రమిది: సాయితేజ్
Advertisement

సుప్రీంహీరో సాయి తేజ్ హీరోగా... మారుతి దర్శకుడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాస్ నిర్మాతగా... గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్ గా... GA2UV పిక్చర్స్ బ్యానర్లో రూపొందిస్తున్న భారీ చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేస్తున్నారు. తమన్ సంగీతం అందించిన ఓ బావ.. అనే పాటను ప్రసాద్ ల్యాబ్‌లో విడుదల చేశారు. ఈ పాటకు కెకె సాహిత్యం అందించగా, యశ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. 

ఈ సందర్భంగా హీరో సాయి తేజ్ మాట్లాడుతూ.. ‘‘మాకు మీడియా నుంచి మంచి సపోర్ట్ వస్తోంది. చాలా థ్యాంక్స్. ఓ బావ సాంగ్‌కి హీరో ఈ చిన్నపాపే. యశ్ మాస్టర్ కొరియోగ్రాఫ్ అదరగొట్టాడు. హాఫ్ డే లో షూట్ చేశారు. తమన్ మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చాడు. చాలా మంచి సాంగ్స్ 5 ఇచ్చాడు. తమన్‌కు ఇన్స్పిరేషన్ ఇచ్చింది మారుతి అన్న. నాకు 15 మినిట్స్ లైన్ చెప్పాడు. ఆ తర్వాత వన్ వీక్ లో ఫుల్ నరేషన్ ఇచ్చారు. సత్యరాజ్, రావు రమేష్, రాశి ఖన్నా‌కి పెర్‌ఫార్మ్ చేసేందుకు స్కోప్ ఉన్న పాత్రలు. కరెంట్ ట్రెండ్‌లో ఉండే టిక్ టాక్ సెలెబ్రిటీగా రాశిని చూపించారు. బెల్లం శ్రీదేవి తర్వాత ఏంజిలా అనే క్యారెక్టర్ బాగా గుర్తుండిపోతుంది. ఈ సినిమాలో నాకు ఎటువంటి డిసీజెస్, మతిమరుపులాంటివి లేవు. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. ఈ సినిమా చేసినందుకు ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాం. మనందరం మనల్ని ప్రశ్నించుకునే చిత్రం. డిసెంబర్ 20న వస్తున్న ఈ సినిమాను తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అని అన్నారు.

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. ‘‘ఏదన్నా మంచి సినిమా చేయాలనే దాంట్లో రకరకాల కథలు అనుకొని ఫ్యామిలీ సబ్జెక్ట్‌గా ప్రతీరోజూ పండగేను తీసుకున్నాను. సోషల్ మీడియాలో ఈ సినిమా పోస్టర్ పెట్టగానే. రకరకాలుగా కథను ఊహించుకుంటున్నారు. తాత మనవడు కథ అనుకుంటున్నారు. ఇద్దరినీ కలిపే కథ అనీ, ఫ్యామిలీని కలిపే కథ అని అనుకుంటున్నారు. అలాంటి కథ కాదు ఇది. ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి పాయింట్ ఇంతవరకు రాలేదు. పుట్టినప్పుడు సెలెబ్రేషన్ చేస్తాం. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు కూడా సంతోషంతో బెస్ట్ సెండాఫ్ ఇవ్వాలనేది ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నాం. కొడుకు ఎదిగిన తర్వాత తండ్రిని మర్చిపోతున్నాడు. తండ్రికి ఎంత వేల్యూ ఇవ్వాలి అనేది ఎంటర్‌టైన్ చేస్తూ హార్ట్ టచింగ్‌గా చెప్పాం. సత్య రాజ్ గారు చేసిన యాక్టింగ్‌కి మాకే కళ్లలో నీళ్లొచ్చాయి. మా నిర్మాతలు బన్నీ వాసు, వంశీ, విక్కీ, మూలస్థంభం అరవింద్‌గారు బాగా సపోర్ట్ చేశారు.  నచ్చి ప్రేమించి చేసిన సినిమా. భలే భలే మగాడివోయ్ స్క్రిప్ట్ చిరంజీవి గారికి చెప్పాను. మళ్లీ ఇప్పుడు ప్రతీరోజూ పండగే కథ మూడు గంటలు విన్నారు. ఆయన ఇచ్చిన ఎనర్జీతో షూటింగ్ కూడా ఫినిష్ చేసుకున్నాం. ఇంతమంది ఆర్టిస్టులతో వర్క్ చేయడం ఇదే ఫస్ట్ టైం. అన్ని వర్గాల్ని మెప్పించే చిత్రం అవుతుంది. సీతారామశాస్త్రి గారు రాసిన పాట ప్రతీ ఒక్కరినీ కదిలిస్తుంది’’ అని అన్నారు.

నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాకు నేను నమ్మింది మారుతిని మాత్రమే. కథ ఒక్కసారి మాత్రమే విన్నాను. మారుతి టైమింగ్ మీద నాకు నమ్మకం ఉంది. ఆ టైమింగ్‌ను తేజు బాగా పండించగలడు. మారుతిని నమ్మి చేసిన సినిమా ఇది. భలే భలే మగాడివోయ్ చెప్పిన దానికంటే ఎక్కువే ఇచ్చాడు. రాశి గారి సినిమాలు ఇంతకుముందు చూశాను కానీ... ఇంత బబ్లీగా ఇంత బాగా చేస్తుందని అనుకోలేదు. తేజుతో పిల్లా నువ్వు లేని జీవితం చేసాను. ఇప్పుడు ఈ సినిమాతో మా రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుందనుకుంటున్నాను’’ అని అన్నారు.  

హీరోయిన్ రాశి ఖన్నా మాట్లాడుతూ.. ‘‘నాకు చాలా చాలా ఇష్టమైన క్యారెక్టర్ ఇది. ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డాను. నేను టిక్ టాక్ లో లేను. ఈ సినిమా కోసం ఫస్ట్ టైం టిక్ టాక్ వీడియోస్ చూశాను. ఆ వీడియోస్ చేయడం చాలా డిఫికల్డ్. మారుతి గారు నేను చేయగలనని నమ్మారు. నాకోసం చాలా మంచి పాత్ర రాశారు. అందరూ ఆ పాత్రను ఇష్టపడతారు.  ఓ బావ... నా ఫేవరేట్ సాంగ్. తమన్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. ఈ పాట లిరిక్స్, విజువల్స్ చాలా బాగున్నాయి. డిసెంబర్ 20న రిలీజ్ అవుతుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అని అన్నారు.  

లిరిసిస్ట్ కెకె మాట్లాడుతూ.. ‘‘టైటిల్ సాంగ్ పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ఓ బావ... అనే సంగీత్ సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. నేను ఫస్ట్ టైం లిరిక్ రాసిన తర్వాత తమన్ ట్యూన్ చేశారు. ఇది తాత మనవడు కథ కాదు. మాయమైన మనిషిలోని కథ ఇది. మెసేజ్ ఒరియెంటెడ్ సినిమా కాదు. ఈ జెనరేషన్ తప్పకుండా చూడాల్సిన సినిమా. మారుతి గారు క్లైమాక్స్ చెబుతున్నప్పుడు కళ్లు చెమర్చాయి. ప్రతీ ఒక్కరు చూడాల్సిన సినిమా. బన్నీ వాసు గారు టాక్సీవాలాలో మాటే వినదుగా సాంగ్ రాసే అవకాశం ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు ఇందులో రెండు పాటలు రాసే అవకాశం ఇచ్చారు. చాలా థ్యాంక్స్..’’ అని అన్నారు.

కొరియోగ్రాఫర్ యశ్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘‘మారుతి గారికి చాలా థ్యాంక్స్. తమన్ సర్ మ్యూజిక్ లో ఫస్ట్ టైం కొరియోగ్రఫీ చేశాను. ఈ సినిమా చేసినప్పుడు చాలా మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అని అన్నారు.  

నటుడు మహేష్ మాట్లాడుతూ.. ‘‘ప్రేమకథా చిత్రమ్‌లో వంద మందిలో ఒకడిగా ఉన్నాను. మారుతిగారు ఇందులో సత్యరాజ్ గారి పక్కన నటించే మంచి అవకాశం ఇచ్చారు. గీతా ఆర్ట్స్‌కి యువి క్రియేషన్స్‌కి చాలా చాలా థ్యాంక్స్’’ అని అన్నారు.

సినిమాటోగ్రాఫర్ జయకుమార్ మాట్లాడుతూ.. ‘‘తెలుగులో ఇది నా ఫస్ట్ సినిమా. ఎమోషన్స్, కామెడీతో కూడుకున్న చిత్రం ఇది. సినిమా ఆద్యంతం అలరిస్తుంది’’ అని అన్నారు.  

నటీనటులు:

సాయి తేజ్, రాశి ఖన్నా, సత్యరాజ్, విజయ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి, గాయత్రీ భార్గవి, హరితేజ, మహేష్, సుహాస్ తదితరులు

 

సాంకేతిక వర్గం:

రచన, దర్శకత్వం – మారుతి

సమర్పణ – అల్లు అరవింద్

ప్రొడ్యూసర్ – బన్నీ వాస్

కో ప్రొడ్యూసర్ – ఎస్.కె.ఎన్

మ్యూజిక్ డైరెక్టర్ – తమన్ .ఎస్

ఎడిటర్ – కోటగిరి వెంకటేశ్వర‌రావ్ (చంటి)

ఆర్ట్ డైరెక్టర్ – రవీందర్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ – బాబు

డిఓపి – జయ కుమార్

పీఆర్ఓ – ఏలూరు శ్రీను

పబ్లిసిటీ డిజైనర్ – అనిల్ భాను

Advertisement

Prathiroju Pandaage Movie Second Song Oo baava Released :

Prathiroju Pandaage Movie Second Song Release Event

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement