నటికాకపోయి ఉంటే.. దీనికి కాజల్ సమాధానమిదే!

Tue 19th Nov 2019 06:09 PM
kajal agarwal,career,vyomagami,hair specialist,heroine kajal  నటికాకపోయి ఉంటే.. దీనికి కాజల్ సమాధానమిదే!
Kajal Agarwal Revealed Interesting Point about Her నటికాకపోయి ఉంటే.. దీనికి కాజల్ సమాధానమిదే!
Sponsored links

ఎవరైనా ఓ హీరోయిన్‌ని మీరు హీరోయిన్ కాకపోయి ఉంటే ఏమయ్యేవారు అంటే...వాళ్లు ఏ డాక్టరో, ఏ ఫ్యాషన్ డిజైనరో అయ్యేవాళ్ళం అంటూ టక్కున చెప్పేస్తారు. కానీ ఓ హాట్ హీరోయిన్ మాత్రం తాను హీరోయిన్ అవ్వకపోయి ఉంటే వ్యోమగామిగా అయ్యేదాన్ని అని చెబుతుంది. ఆమె ఎవరో కాదు... ఈ వయసులోనూ ఇంకా హాట్ హాట్ గా గ్లామర్ షో చేస్తున్న కాజల్ అగర్వాల్. మూడు పదుల వయసు దాటినా... ఇంకా హీరోయిన్ గా కెరీర్ లో దూసుకుపోతున్న కాజల్ అగర్వాల్ ఇంకా కత్తిలాంటి ఫిగర్ ని మెయింటైన్ చేస్తూ యంగ్ బ్యూటీస్ కి గట్టి పోటీ ఇస్తుంది. ప్రస్తుతం కమల్ హాసన్ సరసన ఇండియన్ 2లో నటిస్తున్న కాజల్ అగర్వాల్‌ని ఓ మీడియా పర్సన్ ఈ ప్రశ్న వేసాడు.

మీరు నటిగా కాకపోయి ఉంటే.. ఏమయ్యేవారు అనే ప్రశ్నకు.. వెంటనే కాజల్ తడుముకోకుండా నేను నటిని కాకపోయి ఉంటే... వ్యోమగామిగానో, లేదంటే హెయిర్ స్పెషలిస్ట్ నో అయ్యిండేదానిని అని చెప్పింది. సైన్స్ అంటే ఇష్టమని, అలాగే చిన్నప్పటినుండి జుట్టుని రకరకాల డిజైన్స్ తో అల్లడం ఇష్టమని చెబుతున్న కాజల్ అగర్వాల్ చిన్నప్పుడు తన చెల్లి నిషా అగర్వాల్ కి డబ్బులిచ్చి మరీ.. తన జుట్టుని రకరకాల డిజైన్స్ తో అలంకరించేదానిని... కానీ అలా అనుకోకుండా హీరోయిన్ అయ్యానని చెబుతుంది కాజల్. త్వరలో ఈ భామ పెళ్లి పీటలు ఎక్కబోతుందనే వార్తలు ఈ మధ్య గట్టిగా వినిపిస్తున్నాయి. అన్ని కరెక్ట్‌గా జరిగితే నెక్స్ట్ ఇయర్ కాజల్‌ పెళ్లి.. తన ప్రియుడితో ఉంటుందని అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో..?

Sponsored links

Kajal Agarwal Revealed Interesting Point about Her:

Kajal Agarwal About Her career

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019