‘సాహో’ దర్శకుడి నెక్స్ట్ చిత్రం ఈ హీరోతోనేనా?

Mon 18th Nov 2019 08:15 PM
sujith,sharwanand,saaho,run raja run,sujith next film  ‘సాహో’ దర్శకుడి నెక్స్ట్ చిత్రం ఈ హీరోతోనేనా?
Saaho Director Next Film with Young Hero ‘సాహో’ దర్శకుడి నెక్స్ట్ చిత్రం ఈ హీరోతోనేనా?
Sponsored links

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హీరోగా వచ్చిన ‘రన్ రాజా రన్’ చిత్రంతో కుర్ర దర్శకుడు సుజిత్ ఇండస్ట్రీకి పరిచయం అయిన సంగతి తెలిసిందే. అయితే రెండో సినిమానే ఏకంగా స్టార్ హీరో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌తో ‘సాహో’ తెరకెక్కించి తన పేరు టాలీవుడ్‌లోనే బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌ దాకా మార్మోగేలాగా చేసుకున్నాడీ కుర్ర దర్శకుడు. అయితే ఆ మధ్య మరో పెద్ద స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడని.. ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసి సింగిల్ లైన్ వినిపించాడని టాక్ నడిచిన విషయం విదితమే. ఈ ప్రయత్నం మానుకున్న సుజిత్.. మళ్లీ మొదటికొచ్చాడంట.

మొదటికి అంటే మొదటి సినిమా తీసిన హీరోతో మరోసారి ప్లాన్ చేస్తున్నాడట. తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించిన హీరోతోనే సినిమా చేయాలని సుజిత్ ఫిక్స్ అయినట్లు సమాచారం. రెండో సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారన్న మాట. అయితే ఇందులో ఎంత నిజముందో తెలియట్లేదు కానీ టాలీవుడ్‌ నగర్‌లో మాత్రం పెద్ద ఎత్తున పుకార్లు వస్తున్నాయి. అంతేకాదు.. శర్వాకు ఇప్పటికే కథను సిద్ధం చేసి.. రేపో మాపో ఆయనకు ఆ కథను వినిపించనున్నాడని టాక్ నడుస్తోంది. మరి శర్వా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది. ఈ కాంబోలో అసలు సినిమా వస్తుందా..? రాదా..? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే మరి.

Sponsored links

Saaho Director Next Film with Young Hero:

Director Sujith again Directs Sharwanand

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019