మోక్ష్ ‘ప్లే’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల

Play movie first look released

Mon 18th Nov 2019 02:06 PM
moksh,play,first look,naina sharma,play first look  మోక్ష్ ‘ప్లే’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల
Play movie first look released మోక్ష్ ‘ప్లే’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల
Advertisement

అభినవ్ సింగ్ రాఘవ్, గజాలా, నైనా శర్మ హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న చిత్రం ‘ప్లే’. మోక్ష్ ఈ చిత్ర  దర్శకుడు. మ్యూజిక్‌తో పాటు ఎడిటింగ్ కూడా డైరెక్టర్ మోక్ష్ చేయడం విశేషం. పి.ఎల్. రామ్ ప్రసాద్ డీఓపి. రాజ సులోచన ఈ చిత్రానికి నిర్మాత. టి.ఎం.శేఖర్ సహ నిర్మాత. హర హర మహాదేవ్ క్రియేషన్స్ సమర్పణలో... రాయ్ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంటెన్సివ్ థ్రిల్లర్ జోనర్‌లో ఈ చిత్రాన్ని రూపొందించారు.
రేసీగా ఉండే స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధాన బలం. తర్వాతి సీన్ ఏం జరుగుతుందా.. అనే ఉత్కంఠ రేకెత్తించే చిత్రమిది. ప్రతీ పనికి ఓ ఉద్దేశ్యం ఉంటుందనేది ఈ చిత్రం మెయిన్ పాయింట్. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో ఉండే ప్లే ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నటీనటులు కొత్త వారైనప్పటికీ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని చిత్ర దర్శకుడు అంటున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ ఎడిటింగ్ చాలా కీలకం కానుంది. చిత్ర నిర్మాణంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన చిత్రమిది.

Play movie first look released :

Moksh director movie first look out


Loading..
Loading..
Loading..
advertisement