‘తెనాలి రామకృష్ణ’.. 2గంటలు నవ్విస్తాడంట!

Fri 15th Nov 2019 12:02 PM
sundeep,tenali ramakrishna babl,movie,release,press meet  ‘తెనాలి రామకృష్ణ’.. 2గంటలు నవ్విస్తాడంట!
Tenali Ramakrishna BABL Movie Release Press Meet ‘తెనాలి రామకృష్ణ’.. 2గంటలు నవ్విస్తాడంట!
Sponsored links

రెండు గంటలపాటు ప్రేక్షకుల్ని నవ్వించే చిత్రం ‘తెనాలి రామకృష్ణ’- హీరో సందీప్ కిషన్

యూత్ హీరో సందీప్ కిషన్ హీరోగా స్టన్నింగ్ బ్యూటీ హన్సిక మోత్వాని హీరోయిన్ గా జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి, శ్రీనివాస్, కె.సంజీవ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ’. ఈ చిత్రం నవంబర్15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  

నిర్మాత అగ్రహారం నాగిరెడ్డి మాట్లాడుతూ... చిత్రంలో నటించిన నటీనటులకు స్టార్ డం వస్తుంది.. అంత బాగా నటించారు. ముఖ్యంగా మా హీరో సందీప్ కిషన్ చాలా కష్టపడి వర్క్ చేశారు. అలాగే మా దర్శకుడు నాగేశ్వర రెడ్డి అంతా తానై ఈ ప్రాజెక్ట్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశాడు. సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

మరో నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ.. జవ్వాజి రామాంజనేయులు గారు మాకు బాగా సపోర్ట్ చేశారు. టీమ్ వర్కతో సినిమా కంప్లీట్ చేశాం. ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది. అన్నారు.

సమర్పకుడు జవ్వాజి రామాంజనేయులు మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్ కి 24 గంటల్లో 30 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అప్పుడే ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉందని అర్థం అయింది. సందీప్ కిషన్ కి తమిళంలో మంచి మార్కెట్ ఉంది. అక్కడ ఈ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నాం. నాగేశ్వర్ రెడ్డి సినిమాల్లో వుండే ఎంటర్ టైన్మెంట్ ఈ చిత్రంలో పుష్కలంగా ఉంది. సినిమా గ్యారెంటీగా పెద్ద హిట్ అవుతుంది. అన్నారు.

ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ.. సందీప్ కిషన్ చాలా ఓపికతో కష్టపడి ఈ సినిమా చేశాడు. ఫస్ట్ సినిమా నుండి సందీప్ తో వర్క్ చేస్తున్నాను.

రైటర్ రాజసింహ మాట్లాడుతూ.. సందీప్ తో ఒక్క అమ్మాయి తప్ప సినిమా చేశాను. ఈ కథ నాగేశ్వర్ రెడ్డి గారి దగ్గరకు వెళ్లడం చాలా హ్యాపీగా ఉంది. ఈ చిత్రాన్ని  చాలా అద్భుతంగా తెరకెక్కించారు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. ఈ సినిమా హిట్ అయి నిర్మాతలకు మరిన్ని డబ్బులు రావాలి అన్నారు.

సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మాట్లాడుతూ.. నాగేశ్వర్ రెడ్డి గారితో ఇది నా మూడవ సినిమా. ప్రతి ఆర్టిస్టుకు ఈ సినిమాలో ఇంపార్టెన్స్ ఉంది. సినిమాని ఎక్కువ సార్లు నేనే చూసాను. చాలా అద్భుతంగా వచ్చింది. పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను. నిర్మాతలకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను. అన్నారు.

నటుడు ప్రదీప్ మాట్లాడుతూ.. షడ్రుచులు విందు భోజనంలా ఈ చిత్రం ఉంటుంది. నాగేశ్వర రెడ్డికి నేను పెద్ద ఫ్యాన్. సినిమాని వండర్ ఫుల్ గా తెరకెక్కించారు. చాలా మంచి కథ కుదిరింది. అన్నారు.

దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... నేను ఇంత కూల్ గా ఉండటానికి కారణం 4 పిల్లర్స్ నా నిర్మాతలు. పాశనేట్ తో సినిమాని నిర్మించారు. సందీప్ కిషన్ సినిమా పిచ్చోడు. సినిమా తప్ప అతనికి ఇంకా ఏమి తెలీదు. చాలా కోపరేట్ చేశారు. నిర్మాతల హీరో సందీప్ కిషన్. అలాగే హన్సిక అన్ని ఎమోషన్స్ బాగా డీల్ చేసింది. ప్రతి ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ కష్టపడి వర్క్ చేశారు. వారి అందరికి నా థాంక్స్. సినిమాని హిట్ చెయ్యాలని కోరుకుంటున్నాను.

హీరోయిన్ హన్సిక మోత్వాని మాట్లాడుతూ.. ఈ చిత్రం ప్రేక్షకులందరిని ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నీ ఎమోషన్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. తప్పకుండా ఈ చిత్రాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారు. అన్నారు.

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. కమర్షియల్ ఎంటర్ టైన్మెంట్ తో  థ్రిల్లింగ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని నాగేశ్వర్ రెడ్డి బాగా డీల్ చేశాడు. రెండుగంటలపాటు ఆడియెన్స్ ని నవ్వించడం ఒక గిఫ్ట్ గా భావిస్తున్నాను. నాలుగు సెంటర్స్లో ప్రీమియర్ షోస్ వేస్తున్నాం. ఈ సినిమాతో నాగేశ్వర్ రెడ్డి లాంటి ఒక ఫ్రెండ్ దొరకడం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాలోని ప్లస్ పాయింట్స్ ని ఎలివేట్ చేస్తూ. మైనస్ని కవర్ చేస్తూ.. సినిమాని ఫెంటాస్టిక్ గా రూపొందించారు. హన్సిక మంచి క్యారెక్టర్ చేసింది. అలాగే ప్రమోషన్స్ కి తానే ముందుండి సపోర్ట్ చేస్తుంది. తెనాలి రామకృష్ణ ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది. అన్నారు.

ఎడిటర్ ఛోటాక్. ప్రసాద్, రచయితలు భవాని ప్రసాద్, గణేష్, నివాస్, విక్రమ్ రాజా తదితరులు పాల్గొన్నారు.

Sponsored links

Tenali Ramakrishna BABL Movie Release Press Meet:

Celebrities Speech at Tenali Ramakrishna BABL Movie Release Event

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019