ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Prathiroju Pandage Movie Shooting Update

‘ప్రతిరోజూ పండగే’కు ఒక్క పాటే బ్యాలెన్స్

చిత్రలహరి చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి బంపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మారుతి దర్శకుడిగా, ఎన్నో ఇండస్ట్రీ హిట్ చిత్రాల్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, వంద కోట్ల క్లబ్ లో చేరిన గీత గోవిందం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన బన్నీ వాస్ నిర్మాతగా, అందం అభినయంతో మెప్పిస్తున్న గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్ గా రూపొందిస్తున్న భారీ చిత్రం “ప్రతిరోజూ పండగే”. ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే ఈ పాటను అందమైన లొకేషన్‌లో చిత్రీకరించనున్నారు.

ఇటీవలే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ అమెరికాలో జరిగింది. ఈ సినిమా టైటిల్ సాంగ్ మంచి సందర్భంలో వస్తుంది. అలాంటి టైటిల్ సాంగ్ ని సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన కొద్ది గంటల్లోనే అద్భుతమైన స్పందన లభించింది. ఈ పాటను థమన్ స్వరపరచగా... కె కె సాహిత్యం అందించగా... శ్రీ కృష్ణ అద్భుతమైన గాత్రంతో మెస్మరైజ్ చేశారు.

ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు... ప్రతి ఒక్కరు హాయిగా ఎంజాయ్ చేసే కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. సాయి తేజ్ ను కొత్త రకమైన పాత్ర చిత్రణతో, న్యూ లుక్ లో చూపించబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కుటుంబ బంధాల్ని, విలువల్ని ఎమోషనల్ గా చిత్రీకరించనున్నారు. మారుతి చిత్రాల్లో సహజంగా కనిపించే ఎంటర్‌టైన్‌మెంట్ ఇందులో రెండు రెట్లు ఎక్కువగానే ఉండబోతుంది.

 

నటీనటులు:

సాయి తేజ్, రాశి ఖన్నా, సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి, గాయత్రీ భార్గవి, హరితేజ, మహేష్, సుహాస్ తదితరులు

సాంకేతిక వర్గం

రచన, దర్శకత్వం – మారుతి

సమర్పణ – అల్లు అరవింద్

ప్రొడ్యూసర్ – బన్నీ వాస్

కో ప్రొడ్యూసర్ – ఎస్.కె.ఎన్

మ్యూజిక్ డైరెక్టర్ – తమన్ .ఎస్

ఎడిటర్ – కోటగిరి వెంకటేశ్వర రావ్ (చంటి)

ఆర్ట్ డైరెక్టర్ – రవీందర్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ – బాబు

డిఓపి – జయ కుమార్

పీఆర్ఓ – ఏలూరు శ్రీను

పబ్లిసిటీ డిజైనర్ – అనిల్ భాను

Prathiroju Pandage Movie Release Date Out

Prathiroju Pandage Movie Shooting Update
prathiroju pandage movie
shooting update
song shooting balance
sai tej
maruthi