రజనీ, అజిత్, విజయ్ తర్వాత కార్తీనే..!!

Thu 14th Nov 2019 12:26 PM
rajanikanth,ajith,vijay,kharthi,karthi khaidi  రజనీ, అజిత్, విజయ్ తర్వాత కార్తీనే..!!
News About Khaidi Hero Karthi రజనీ, అజిత్, విజయ్ తర్వాత కార్తీనే..!!
Sponsored links

యాంగ్రీ హీరో కార్తీ నటించిన డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఖైదీ’. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. దీంతో బ్లాక్ బస్టర్‌గా సూపర్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై పలువురు ప్రముఖులు సర్వత్రా ప్రశంసల వర్షం కురిపించిన విషయం విదితమే. అయితే ఇంతవరకూ ఈ చిత్రం ఎన్నికోట్లు కలెక్ట్ చేసిందనే వార్తలు మాత్రం పెద్దగా బయటికి రాలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది.

ఖైదీ చిత్రం ఇప్పటి వరకూ 100 కోట్ల మార్క్‌ను చేరుకుందట. వాస్తవానికి తమిళ హీరోల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్, అజిత్, విజయ్ సినిమాల టాక్ ఎలా వున్నా ఈజీగా ఆ సినిమాలు 100 కోట్ల మార్కును టచ్ చేస్తుంటాయ్. అయితే మిగతా హీరోల సినిమాలు ఈ దరిదాపుల్లోకి కూడా రావ్. బహుశా ఆ జాబితాలో ఫస్ట్ టైమ్ కార్తీ వెళ్లాడు. ఇవన్నీ అటుంచితే కార్తీ తన కెరియర్లో ఇంతవరకూ హిట్ సినిమాలు చేసినప్పటికీ.. అవేవి 100 కోట్ల క్లబ్‌లోకి చేరకపోగా.. ఖైదీ మాత్రం చేరింది. నిజంగా ఇది కార్తీ కెరీర్‌లో మైల్‌స్టోన్ అని చెప్పుకోవచ్చు. 

‘100 కోట్ల క్లబ్‌లో నా సినిమాను చూసుకోవాలనే నా కల ‘ఖైదీ’ నిజం చేసింది. కెరియర్లో తొలిసారిగా బ్లాక్ బస్టర్ హిట్ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని కార్తీ ఆనందంలో మునిగితేలుతున్నాడు. కంటెంట్‌పై నమ్మకంతో కార్తీ బరిలోకి దిగాడని.. ఇప్పుడు అదే నమ్మకం, కంటెంట్ ఆయన్ను ఎక్కడికో తీసుకెళ్లిందని విమర్శకులు చెబుతున్నారు. కాగా.. విజయ్ ‘విజిల్’ కూడా ఇదే దీపావళికి వచ్చినప్పటికీ పెద్దగా విజిల్ వేయలేకపోయింది. అయితే ఖైదీ మాత్రం సినిమాలో ‘లారీ’లో లాగానే యమా స్పీడ్‌గా దూసుకెళ్తున్నాడు. ఇదిలా ఉంటే.. త్వరలో ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఖైదీ-2’ తెరకెక్కించబోతున్నారు. మరి ఆ సినిమా మున్ముంథు మరెన్ని రికార్డ్ బ్రేక్ చేస్తుందో వేచి చూడాల్సిందే మరి.

Sponsored links

News About Khaidi Hero Karthi:

News About Khaidi Hero Karthi

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019