మరో రికార్డ్ సృష్టించిన మహేష్ ‘మహర్షి’!

Thu 14th Nov 2019 01:32 AM
superstar mahesh,mahesh babu,maharshi,record,twittter  మరో రికార్డ్ సృష్టించిన మహేష్ ‘మహర్షి’!
Mahesh Maharshi Movie Breaks Another Record! మరో రికార్డ్ సృష్టించిన మహేష్ ‘మహర్షి’!
Sponsored links

సూపర్‌స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్దే నటీనటులుగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘మహర్షి’. మే-09న విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టయ్యింది. అంతేకాదు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పటికే రెండు మూడు సార్లు టీవీల్లో కూడా సినిమా వచ్చేసింది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని ఈ సినిమాను కుటుంబ సమేతంగా తెగ చూసేస్తున్నారు. ఇలా అందరి ఆదరాభిమానాలు పొందిన ఈ చిత్రానికి మరో అరుదైన గౌరవం లభించింది. 

ఈ సినిమా 2019లో ట్విట్టర్‌లో టాప్ 5 ట్రెండింగ్ ట్యాగ్‌లో నిలిచింది.

- టాప్ 1లో అజిత్ హీరోగా నటించిన ‘విశ్వాసం’

- టాప్ 2లో లోక్‌సభ ఎన్నికలు

- టాప్ 3లో వరల్డ్ కప్ 2019

- టాప్ 4లో మహేష్ ‘మహర్షి’ 

- టాప్ 5లో దీపావళి అనే ట్యాగ్ నిలిచాయి. 

మహేష్ ఇలా కూడా ట్రెండ్ సెట్టరయ్యారన్న మాట. తాజా రికార్డ్‌తో మహేశ్ అభిమానులు, ఘట్టమనేని ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో మహేష్ రిషి అనే స్టూడెంట్‌గా.. పెద్ద ఐటీ కంపెనీ ఓనర్‌గా నటించి క్రిటిక్స్ నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. అంతేకాదు రైతు, ఫ్రెండ్ అనే రెండింటి మధ్యే కథ సాగుతుంది. ఇవన్నీ అటుంచింతే వీకెండ్ వ్యవసాయం అనేది అంతకు మునుపు ఉందో లేదో తెలియదు కానీ.. మహర్షి వచ్చిన తర్వాత బాగా ట్రెండ్ అయ్యింది.

Sponsored links

Mahesh Maharshi Movie Breaks Another Record!:

Mahesh Maharshi Movie Breaks Another Record!  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019