‘ఏడు చేపల కథ’.. మీసం తిప్పుతోంది!

Sat 09th Nov 2019 09:16 PM
yedu chepala katha,yedu chepala katha movie,yedu chepala katha collections,thipparaa meesam,sensation  ‘ఏడు చేపల కథ’.. మీసం తిప్పుతోంది!
Yedu Chepala Katha Creates Sensation at Box Office ‘ఏడు చేపల కథ’.. మీసం తిప్పుతోంది!
Sponsored links

ఈవారం తిప్పరామీసం కన్నా ఒక రోజు ముందు ఓ అడల్ట్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు నెలల ముందు 7 చేపల కథ అంటూ ఓ ట్రైలర్‌ని వదిలితే.... ఆ ట్రైలర్ నిండా బూతులు, వల్గర్ సీన్స్ చూసి బాబోయ్ ఈ సినిమానా అనేంతగా నోర్లు తెరిచారు. రీసెంట్ గా ఈ గురువారం ఎలాంటి ప్రమోషన్స్, అంచనాలు లేకుండా విడుదలైన ఈ 7 చేపల కథ సినిమాని చూసిన వారు అమ్మో ఇంత బూతా అంటూ పెదవి విరుస్తున్నారు. మరీ వల్గర్ బూతు డైలాగ్స్, భీభత్సమైన వల్గర్ సీన్స్ తో సినిమా నిండిపోయింది.. అసలు ఇలాంటి వల్గర్ సినిమాని ఎవరు చూస్తారు అన్నారు.

కానీ అనూహ్యంగా ఈ సినిమా కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. మాస్ ఏరియాలలో ఈ సినిమా కలెక్షన్స్ మోత మోగిస్తుంది. బిసి సెంటర్స్ లో ఈ సినిమా దుమ్ముదులుపుతుంది. ఈ సినిమా టికెట్స్ కోసం యూత్ మొత్తం థియేటర్స్ ముందు బారులు తీరారు అంటే.. ఈ సినిమా బూతుకి ప్రేక్షకులు ఎంతగా కనెక్ట్ అయ్యారో అర్ధమవుతుంది. అసలు సోదిలో లేని ఈ సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం చూసిన సినిమా నిర్మాతలకే నమ్మకం కుదరడం లేదట. మరి మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా ఎంతెలా కనెక్ట్ అయ్యింది అంటే... బూతు సినిమాకి టికెట్స్ కోసం కొట్టుకునేంత అంటున్నారు సాధారణ ప్రేక్షకులు. 

Sponsored links

Yedu Chepala Katha Creates Sensation at Box Office:

Superb collections to Yedu Chepala Katha Movie

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019