అశోక్ గ‌ల్లా డెబ్యూ మూవీకి ముహుర్తం ఫిక్స్!

Ashok Galla Debut Film, New Look

Thu 07th Nov 2019 08:32 PM
Advertisement
ashok galla,new film,new look,confirmed  అశోక్ గ‌ల్లా డెబ్యూ మూవీకి ముహుర్తం ఫిక్స్!
Ashok Galla Debut Film, New Look అశోక్ గ‌ల్లా డెబ్యూ మూవీకి ముహుర్తం ఫిక్స్!
Advertisement

న‌వంబ‌ర్ 10న అశోక్ గ‌ల్లా డెబ్యూ మూవీ గ్రాండ్ లాంచ్

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బావ‌, గుంటూరు పార్ల‌మెంట్ స‌భ్యుడు జ‌య‌దేవ్ గ‌ల్లా త‌న‌యుడు అశోక్ గ‌ల్లా హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. ‘భ‌లే మంచి రోజు’, ‘శ‌మంత‌క మ‌ణి’, ‘దేవ‌దాస్’ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకోవ‌డ‌మే కాదు.. క‌మ‌ర్షియ‌ల్ విజ‌యాల‌ను ద‌క్కించుకున్న యువ ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రామానాయుడు స్టూడియోలో న‌వంబ‌ర్ 10న గ్రాండ్ లెవ‌ల్లో జ‌ర‌గ‌నున్న ఈ సినిమా ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌రవుతున్నారు. త‌న‌దైన స్టైల్లో డైరెక్ట‌ర్ శ్రీరామ్ ఆదిత్య డిఫ‌రెంట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. న‌రేశ్‌, స‌త్య‌, అర్చ‌నా సౌంద‌ర్య ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తుండ‌గా రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

న‌టీన‌టులు:

అశోక్ గ‌ల్లా, న‌రేశ్‌, స‌త్య‌, అర్చ‌నా సౌంద‌ర్య త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శ‌్రీరామ్ ఆదిత్య‌.టి

నిర్మాత‌:  ప‌ద్మావ‌తి గ‌ల్లా

బ్యాన‌ర్‌: అమ‌ర్ రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  చంద్ర‌శేఖ‌ర్ రావిపాటి

మ్యూజిక్‌:  జిబ్రాన్‌

సినిమాటోగ్ర‌ఫీ:  రిచ‌ర్డ్ ప్ర‌సాద్‌

ఆర్ట్‌:  రామాంజ‌నేయులు

ఎడిట‌ర్‌: ప‌్ర‌వీణ్ పూడి

డైలాగ్స్‌:  క‌ల్యాణ్ శంక‌ర్‌, ఎ.ఆర్‌.ఠాగూర్‌

కాస్ట్యూమ్స్‌:  అక్ష‌య్ త్యాగి, రాజేష్‌

పి.ఆర్‌.ఒ:  బి.ఎ.రాజు, వంశీ శేఖ‌ర్‌

Advertisement

Ashok Galla Debut Film, New Look:

Finally, Mahesh Nephew Debut Confirmed  

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement