రానాతో డేటింగ్, ప్రేమ-పెళ్లిపై రకుల్‌ రియాక్షన్

Actress Rakul Reacts Dating, Love With Rana Daggubati

Thu 07th Nov 2019 07:24 PM
Advertisement
actress rakul preet singh,dating,love,rana daggubati  రానాతో డేటింగ్, ప్రేమ-పెళ్లిపై రకుల్‌ రియాక్షన్
Actress Rakul Reacts Dating, Love With Rana Daggubati రానాతో డేటింగ్, ప్రేమ-పెళ్లిపై రకుల్‌ రియాక్షన్
Advertisement

సినీ ఇండస్ట్రీలో డేటింగ్, లింకప్ రూమర్స్ చాలా కామన్ అనే విషయం తెలిసిందే. ఇలాంటి రూమర్స్ వల్ల కొందరికి పాపులారిటీ వస్తుంది.. మరికొందరికి చిరాకు వస్తుంది. వీటిపై ఎన్నిసార్లు రియాక్ట్ అయినా వార్తలు ఆగవ్.. రియాక్ట్ అయ్యే కొద్దీ పుకార్లు ఎక్కువవుతుంటాయ్. ఇక విషయానికొస్తే.. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన రానా దగ్గుబాటి.. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ విజయవంతంగా రాణిస్తున్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అని ఎప్పట్నుంచో వార్తలు వినవస్తున్నాయి. అంతేకాదు.. వాళ్ల ప్రయాణం డేటింగ్‌తో మొదలై ప్రేమగా.. పెళ్లి దాకా వెళ్తోందని కూడా అప్పట్లో టాలీవుడ్‌లో పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఇటు రానా.. అటు రకుల్ ఇద్దరూ స్పందించి క్లారిటీ ఇచ్చినప్పటికీ వార్తలు మాత్రం ఆగలేదు.

అయితే తాజాగా ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో భాగంగా రకుల్ ఈ వ్యవహారంపై స్పందించి తేల్చేసింది. ‘రానాకు నాకు మధ్య ఉన్నది స్నేహం మాత్రమే.. ప్రేమ కాదు. మంచు లక్ష్మి నాకు స్నేహితురాలు. నేను ఎవరితోనూ డేటింగ్‌లో లేను. నా ఇల్లు, రానా ఇల్లు రెండు పక్కపక్కనే.. మేమిద్దరి కేవలం రెండు నిమిషాల్లో వెళ్లేంత దగ్గరగా ఇళ్లు ఉంటాయ్. నేను సినిమాల్లోకి రాక ముందునుంచే రానా తెలుసు. మేం ఎప్పుడూ డేటింగ్‌కు వెళ్లలేదు. నాకు ప్రేమించేంత టైమ్ లేదు. వరుస సినిమాలతో బిజిబిజీగా ఉన్నాను. ఈ రోజుల్లో ప్రేమకు అర్థం మారిపోయింది.. అందుకే నేను 70ల కాలంలో పుట్టుంటే బాగుండేదని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. రానా మరో యువతితో ప్రేమలో ఉన్నాడు. మేం స్నేహితులుగానే ఉన్నాము. రానా సహా నేను అందరి హీరోతో అలాగే ఉన్నాను. ఇంతవరకూ నేను ఎవరితోనూ లవ్‌లో పడలేదు.. ఇంకా సింగిల్‌‌గానే ఉన్నాను’ అని రకుల్ క్లారిటీ ఇచ్చుకుంది. అయితే రకుల్‌కు ఈ మాటలన్నీ మనసులో నుంచి వచ్చాయా..? లేకుంటే పెదవి నుంచే వచ్చాయా..? అసలు ఇందులో నిజానిజాలెంత..? అన్నీ అబద్ధాలేనా అనేవి రకుల్‌-రానాకే ఎరుక.

Advertisement

Actress Rakul Reacts Dating, Love With Rana Daggubati:

Actress Rakul Reacts Dating, Love With Rana Daggubati  

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement