కొత్త లుక్‌తో సర్ప్రైజ్ చేసిన శత్రు

Shatru New Look Creates Sensation

Thu 07th Nov 2019 04:59 PM
Advertisement
shatru,actor shatru,new look,sensation  కొత్త లుక్‌తో సర్ప్రైజ్ చేసిన శత్రు
Shatru New Look Creates Sensation కొత్త లుక్‌తో సర్ప్రైజ్ చేసిన శత్రు
Advertisement

‘శత్రు’ తెలుగులో ఉన్న టాలెంటెడ్ ఆర్టిస్టులలో ఒకరు. ‘కృష్ణ గాడి వీర ప్రేమ కథ’ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శత్రు  విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాడు. ‘అరవింద సమేత’ లో శత్రు పాత్రకు ప్రత్యేక ప్రశంసలు దక్కాయి.  ప్రతి సినిమాలో తన వైవిధ్యమైన నటనతో ఆకట్టుకున్న శత్రుకి తెలుగులో అవకాశాలుతో పాటు ఇతర భాషల్లో  అవకాశాలు చాలా పెరిగాయి.  

ఏ  పాత్రకయినా సరిపోయే ఆహార్యం వాచకం అతనికి పెద్ద అసెట్ గా మారాయి. ఇప్పుడు అతను అతని లూక్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. నటన పట్ల తనకున్న అంకిత భావం, ఇండస్ట్రీలోని పోటీని తట్టుకునేందుకు తనను తాను కొత్తగా మలుచుకునేందుకు శత్రు ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా మలుచుకోగలడు అని ఈ లుక్స్ తో తెలుస్తుంది.

ఒక రగ్గడ్ లుక్ నుంచి ఆల్ట్రా మోడ్రన్ లుక్ కి  ట్రాన్స్ఫ ర్మేషన్ అవ్వడం లో అతను తీసుకున్న జాగ్రత్తలు, పాటించిన ఆహారనియమాలు అతను చేసిన కఠోర శ్రమ శత్రుని కొత్తగా  పరిచయం చేశాయి. ఏ ఆర్టిస్ట్ కైనా  ఎప్పటికప్పుడు తనను కొత్తగా ప్రజెంట్ చేసుకోవటం, తన పరిధిని పెంచుకోవటం అనేది కొత్త అవకాశాలను దారి తీస్తుంటుంది. శత్రు చేయబోయే విభిన్న పాత్రలకు ఈ లుక్స్ మొదటి అడుగు అనడంలో సందేహం లేదు. 

Advertisement

Shatru New Look Creates Sensation:

Actor Shatru New Look released

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement