నవంబర్ 29న ‘రఘుపతి వెంకయ్య నాయుడు’

Thu 07th Nov 2019 09:42 AM
raghupathi venkaiah naidu movie,release date,naresh vk  నవంబర్ 29న ‘రఘుపతి వెంకయ్య నాయుడు’
Raghupathi Venkaiah Naidu Movie Release Date Fixed నవంబర్ 29న ‘రఘుపతి వెంకయ్య నాయుడు’
Sponsored links

నటుడు నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా రఘుపతి వెంకయ్య నాయుడు. ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమాగా పిలవబడే రఘుపతి వెంకయ్య జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి కావడంతో నవంబర్ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. ఈ సినిమా గురించి నరేష్ మాట్లాడుతూ.. రఘుపతి వెంకయ్య గారి పాత్రలో నటించడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను.. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం ఇది. తెలుగు సినిమా బతికున్నంత వరకు ఈ చిత్రం అందరికీ గుర్తుండిపోతుంది. దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ.. తెలుగు సినిమా కోసం రఘుపతి వెంకయ్య గారు చేసిన కృషిని గుర్తు చేయడానికి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.. ఈ సినిమా కోసం చాలా రీసర్చ్ చేసాం.. నటీనటులు కూడా తమ ఉత్తమ ప్రదర్శన ఇచ్చారు. ఎల్లో లైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మండవ సతీష్ బాబు, రఘుపతి వెంకయ్య నాయుడు సినిమాను నిర్మిస్తున్నారు.

నటీనటులు:

నరేష్ వికే, తణికెళ్ల భరణి, మహర్షి, వాహిని, సత్య ప్రియ, భావన, అఖిల్ సన్నీ, మునిచంద్ర, సాయికాంత్, చాణక్య, దేవ్ రాజ్ తదితరులు

సాంకేతిక నిపుణులు:

రచన, దర్శకుడు: బాబ్జీ

నిర్మాత: మండవ సతీష్ బాబు

బ్యానర్: ఎల్లో లైన్ పిక్చర్స్

సంగీతం: శ్రీ వెంకట్

బ్యాగ్రౌండ్ స్కోర్: రాజ్

సినిమాటోగ్రఫీ: కిషన్ సాగర్

ఎడిటింగ్: మోహన్ రామారావు

Sponsored links

Raghupathi Venkaiah Naidu Movie Release Date Fixed:

Raghupathi Venkaiah Naidu Movie Release On Nov 29th

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019