Advertisement

యస్ 5- నో ఎగ్జిట్ మూవీ ప్రారంభం

Tue 29th Oct 2019 09:23 PM
s5 no exit,movie,launch,details  యస్ 5- నో ఎగ్జిట్ మూవీ ప్రారంభం
S5 No Exit Movie Launched యస్ 5- నో ఎగ్జిట్ మూవీ ప్రారంభం
Advertisement

సాగా ఎంటర్ టైన్మెంట్స్ అండ్ ఆర్ ఆర్ ఆర్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘యస్5 - నో ఎగ్జిట్’ మూవీ ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ క్లాప్ నివ్వగా, నిర్మాత గౌతమ్ తనయుడు అర్జున్ కెమెరా స్విచ్ఛాన్ చేసాడు. హైటెక్నికల్ వాల్యూస్ తో నిర్మాణం జరుపుకోబోతున్న ఈ మూవీకి  స్వర బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు వినియోగించే ‘ రెడ్ రేంజర్ విస్టా’ కెమెరా  ఇండియన్ స్ర్కీన్ కు యస్ 5 సినిమాతో రాబోతుంది. సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకొని డిసెంబర్ కి  ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. ఈ రోజు లోకేషన్ లోనే పూజా కార్యక్రమాలు జరుపుకోని రెగ్యులర్ షూట్ ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా  దర్శకుడు సన్ని కోమలపాటి మాట్లాడుతూ:

‘కథ వినగానే మణిశర్మ గారు చాలా ఇంప్రెస్ అయి ఈ సినిమాకు పనిచేయడానికి ఒప్పుకున్నారు. మా కాన్సెప్ట్ తో కనెక్ట్ అయి తారక్, ప్రిన్స్ లు ముందుకు వచ్చారు. కథ విన్న గంటలోనే సినిమా నిర్మాతలు  వెంటనే ఈ సినిమా చేస్తున్నాం అన్నారు. నిర్మాతలు రాహుల్, గౌతమ్ ఇచ్చిన సపోర్ట్ తో కథ లాక్ అయిన నెలలో సెట్స్ మీదకు సినిమాను తీసుకురాగలిగాము. టెక్నికల్ గా హై స్టార్డర్డ్స్ తో నిర్మించబోతున్న ఈ మూవీ కోసం ఒక ట్రైన్ సెట్ ని నిర్మించాము. ఇండియాలో మొదటిసారిగా ‘రెడ్ రేంజర్ విస్టా’ కెమెరాతో షూట్  చేయబోతున్నాం. మా సినిమాటోగ్రాఫర్ అంజి ఈ సినిమాకు ప్రధానం బలం. అసలు ప్రయాణంలో నో ఎగ్జిట్ అనేది ఉంటే ఆ ప్రయాణం ఎలా ఉండబోతుందనేది ఈ సినిమా కాన్సెప్ట్ ఆద్యంతం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగే ఈ ప్రయాణం తప్పకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతలనిస్తుందని మా నమ్మకం. ఈ మూవీలో హీరోలు, హీరోయిన్లు కాన్సెప్ట్ ఉండదు. అందరూ క్యారెక్టర్స్ గానే కనపడతారు. తారకరత్న లుక్ కొత్తగా ఉండబోతుంది.’ అన్నారు.

తారకరత్న మాట్లాడతూ:

‘దర్శకుడు సన్ని కథను చెప్పిన తీరు చాలా బాగుంది. కథను అతను యానిమేషన్ లో డెవలెప్ చేసి వివరించినప్పుడు చాలా బాగా కనెక్ట్ అయ్యాను. మణిశర్మగారి మ్యూజిక్, సినిమాటోగ్రాఫర్ అంజి గారు మా కథకు వెన్నుదన్నుగా నిలిచారు. ప్రిన్స్ తో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ లను అందిస్తుందని నమ్ముతున్నాను’ అన్నారు.

ప్రిన్స్ మాట్లాడుతూ:

‘ఒక యంగ్ టీంతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు సన్ని కొత్త వాడు అయినా కాన్పెప్ట్ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాడు. హైటెక్నికల్ టీంను సినిమాకు సెట్ చేసాడు. నా పాత్ర చాలా కొత్తగా ఉంది. ఎంట్రీ తప్ప ఎగ్జిట్ ఉండని ప్రయాణం ఎలా ఉండబోతుంది అనేది ఉత్కఠంగా తెరమీదకు రాబోతుంది. మణిశర్మ మ్యూజిక్ పెద్ద అసెట్ గా నిలుస్తుంది. కథ లాక్ అయిన తర్వాత ఇంత త్వరగా సెట్స్ మీదకు సినిమా వచ్చిందంటే కారణం ప్రొడ్యూసర్స్ గౌతమ్, రాహుల్ ఇచ్చిన సపోర్ట్. డిసెంబర్ లో సినిమా కంప్లీట్ అవుతుంది’ అన్నారు.

నటుడు ఆలీ మాట్లాడుతూ:

‘దర్శకుడు సన్ని కథ చెప్పగానే చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది. మణిశర్మ గారు మ్యూజిక్ అందించడం చాలా సంతోషంగా ఉంది. హైటెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమా రూపొందింస్తున్నారని తెలుస్తుంది. నా క్యారెక్టర్ తప్పకుడా ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తుంది ’ అన్నారు.

నిర్మాత గౌతమ్ కంటిపూడి మాట్లాడుతూ:

‘కథ విన్న 40 రోజులకు ఈ సినిమాను సెట్స్ మీదకు తెచ్చాం. సన్ని చెప్పే కథలో ఉండే గ్రిప్పింగ్ పాయింట్ కి ఇంప్రెస్ అయి మణిశర్మ గారు మ్యూజిక్ అందించేందుకు అంగీకరించారు. మణిశర్మ గారి పెద్ద థ్యాంక్స్. అలాగే హాలీవుడ్ సినిమాలకు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లకు వాడే ‘రెడ్ రేంజర్ విస్టా’ కెమెరాను యస్ 5 కోసం తెచ్చాం. సినిమాటోగ్రాఫర్ అంజి ఈ సినిమాకు ప్రధాన బలంగా మారాడు. ప్రేక్షకలకు యస్ 5 నో ఎగ్జిట్  సరికొత్త అనుభూతలను ఇస్తుందని మా నమ్మకం’ అన్నారు.

మరో నిర్మాత రాహుల్  రెడ్డి మాట్లాడుతూ:

‘స్ర్కిప్ట్ వినగానే కథను ఓకే చేసాం. ఈ కథను వినగానే ఓకే చేసిన మణిశర్మ గారి చాలా థ్యాంక్స్. సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేస్తాము. హెటెక్నికల్ స్టాండర్డ్స్ తో సినిమా రూపొందబోతుంది.’ అన్నారు.

లీడ్ రోల్ చేస్తున్న అవంతిక మాట్లాడుతూ:

‘కాన్సెప్ట్ వినగానే కొత్తగా అనిపించింది. ఒక ఎనర్జిటిక్ టీంతో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. దర్శకుడు సన్నీకి, నిర్మాతలు రాహుల్, గౌతమ్ లకు చాలా థ్యాంక్స్’ అన్నారు.

లీడ్ రోల్ చేస్తున్న రుతుజా మాట్లాడుతూ:

‘టెక్నికల్ గా హై స్టార్డెండ్ మూవీ తో తెలుగు సినిమాకు పరిచయం అవడం చాలా సంతోషంగా ఉంది. నో ఎగ్జిట్ అనే ట్యాగ్ లైన్ లోనే యస్ 5 లో ప్రయాణం ఎంత థ్రిల్లింగ్ గా ఉండబోతుందో తెలుస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు సన్నీకి నిర్మాతలు రాహుల్, గౌతమ్ లకు థ్యాంక్స్’ అన్నారు.

డాన్సర్ సురేష్ వర్మ మాట్లాడుతూ:

‘కొరియోగ్రాఫర్ గా సన్ని అందరికీ తెలుసు కానీ దర్శకుడు ఇలాంటి కథను రెడీ చేస్తాడని అనుకోలేదు. చాలామంది చాలా చేయాలనుకుంటారు.  అలాంటి వారికి సన్నీ ఇన్సిపిరేషన్ గా నిలుస్తాడు.  నా పాత్ర ఈసినిమాలో చాలా ఆసక్తిగా సాగుతుంది ’ అన్నారు.

హైదరాబాద్ శివార్లలో ఖానాపూర్ లో వేసిన ట్రైన్ సెట్ హైలెట్ గా నిలుస్తుంది. సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ అయ్యే ఈ మూవీ ఫస్ట్ కాపీ డిసెంబర్ లో రెడీ అవుతుంది.

నటీనటులు:

ఈ మూవీలో నటీ నటులు తారక్ రత్న, ప్రిన్స్, అవంతిక, రుతుజా, అలీ, సాయికుమార్, రఘు కారు మంచి, ఫిష్ వెంకట్, సంజయ్.

సాంకేతిక వర్గం:

మ్యూజిక్ :మణిశర్మ  

ఎడిటర్ : గ్యారీ బీహెచ్

లిరిక్స్  : శ్రీమణి, కల్యాణ చక్రవర్తి.  

ఆర్ట్  : నాగేంద్ర

డైలాగ్స్ : కళ్యాణ్ చక్రవర్తి

కో ప్రొడ్యూసర్  : GMR

ఫైట్స్ : రియల్ సతీష్

VFX: తేజ్ దిలీప్

 ప్రొడక్షన్ కంట్రోలర్ : బెక్కం రవీందర్

పి ఆర్ ఓ : జి యస్ కే మీడియా

ప్రోడ్యూసర్స్: గౌతమ్ కంటి పూడి, రాహుల్ రెడ్డి.

డైరెక్టర్ : సన్నీ కోమలపాటి

S5 No Exit Movie Launched:

Celebrities speech at S5 No Exit Movie Opening

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement