Advertisementt

నాగ్ మాటను కాదనలేక ఒప్పుకున్న చిరు!

Tue 29th Oct 2019 01:06 PM
megastar chiranjeevi,nagarjuna,telugu biggboss,biggboss-3  నాగ్ మాటను కాదనలేక ఒప్పుకున్న చిరు!
News About Megastar Chiranjeevi and Nagarjuna! నాగ్ మాటను కాదనలేక ఒప్పుకున్న చిరు!
Advertisement
Ads by CJ

టైటిల్ చూడగానే నిజమా..? అని అనిపిస్తోంది కదూ.. అవును మీరు వింటున్నది నిజమే. తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3 చివరి దశకు చేరుకున్న విషయం విదితమే. అయితే గ్రాండ్‌ ఫినాలేను గ్రాండ్‌గా జరపాలని భావిస్తున్న ‘మా’ టీవీ యాజమాన్యం భారీగా ప్లాన్‌ చేస్తోందట. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారట. ఇటీవలే ఈ ఫినాలేకు రావాలని షో నిర్వాహకులు చిరును కోరగా ఒప్పుకోలేదట. అయితే టాలీవుడ్ మన్మథుడు, బిగ్‌బాస్ వ్యాఖ్యాత యువసామ్రాట్ నాగార్జున రంగంలోకి దిగడంతో మెగాస్టార్ కాదనలేకపోయారట.

చిరుతో పాటు అంజలి, నిధి అగర్వాల్ హౌస్‌లోకి విచ్చేస్తారట. చిరు ఎంట్రీ ఇచ్చే టైమ్‌లో ఈ ఇద్దరు భామలు సాంగ్‌తో వెల్‌కమ్‌ పలుకుతారట. అనంతరం చిరు కూడా ఈ ఇద్దరు భామల నడుమ స్టెప్పులేసి బిగ్‌బాస్ ప్రియులను కనువిందు చేస్తారట. అనంతరం చిరు చేతుల మీదుగానే విజేతగా నిలిచిన వారికి రూ.50 లక్షలు బహుమతి ఇస్తారట. కాగా.. ఇప్పటికే శివజ్యోతి అలియాస్ తీన్మార్ సావిత్రి ఎలిమినేట్ అయిన విషయం విదితమే. రాహుల్, వరుణ్, అలీ, బాబా భాస్కర్, శ్రీముఖి తుదిపోరులో నిలిచారు. వీరిలో శ్రీముఖికే విజేతగా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

చిరు హౌస్‌లోకి వచ్చే మాటే నిజమైతే మెగాస్టార్ అభిమానులకు డబుల్ ధమాకానే. ఈ విషయం తెలుసుకున్న మెగాభిమానులు, బిగ్‌బాస్ ప్రియుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయ్.! సోషల్ మీడియా వేదికగా మెగాభిమానులు పెద్ద ఎత్తున ఇందుకు సంబంధించిన వార్తలను, ఫొటోలను మిక్స్ చేసి హడావుడి చేస్తున్నారు. మరి బిగ్‌బాస్ విన్నర్‌గా ఎవరి నిలుస్తారో..? చిరు చేతుల మీదుగా ఎవరు బహుమతి అందుకుంటారో వేచి చూడాల్సిందే మరి.

News About Megastar Chiranjeevi and Nagarjuna!:

News About Megastar Chiranjeevi and Nagarjuna!  

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ