Advertisementt

‘అర్జున్ సుర‌వ‌రం’ మళ్లీ వార్తల్లోకి..!

Sun 27th Oct 2019 09:05 AM
arjun suravaram,movie,release,november 29  ‘అర్జున్ సుర‌వ‌రం’ మళ్లీ వార్తల్లోకి..!
Arjun Suravaram New Release Date Announced ‘అర్జున్ సుర‌వ‌రం’ మళ్లీ వార్తల్లోకి..!
Advertisement
Ads by CJ

యంగ్ హీరో నిఖిల్ క‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ నిర్మాత ఠాగూర్ మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో.. మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై  టి.సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో  రాజ్‌కుమార్ అకెళ్ల నిర్మించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘అర్జున్ సుర‌వ‌రం’.  దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల విష‌యంలో కొన్ని స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంది. ఈ నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డింది. న‌వంబ‌ర్ 29న ఈ సినిమాను విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.

నిఖిల్ స‌ర‌స‌న లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టించింది. పోసాని కృష్ణ‌ముర‌ళి, సత్య‌, త‌రుణ్ అరోరా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. సామ్ సి.ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సూర్య సినిమాటోగ్ర‌ఫీ అందించారు. ఈ సినిమా టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

న‌టీన‌టులు:

నిఖిల్‌, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల‌కిషోర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌రుణ్ అరోరా, నాగినీడు, స‌త్య‌, విద్యుల్లేఖా రామ‌న్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  టి.సంతోష్‌

స‌మ‌ర్ప‌ణ‌:  ఠాగూర్ మ‌ధు

నిర్మాత‌:  రాజ్‌కుమార్ అకెళ్ల‌

సంగీతం:  సామ్ సి.ఎస్‌

సినిమాటోగ్ర‌ఫీ:  సూర్య‌

ఎడిట‌ర్:  న‌వీన్ నూలి

పి.ఆర్‌.ఒ:  వంశీశేఖ‌ర్‌

Arjun Suravaram New Release Date Announced:

Arjun Suravaram Movie Release on Nov 29th

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ