Advertisementt

బాల‌య్య 105వ చిత్రం టైటిల్, రిలీజ్ డేట్!

Sun 27th Oct 2019 02:24 AM
balakrishna,105 movie,title,ruler,release,date,announced  బాల‌య్య 105వ చిత్రం టైటిల్, రిలీజ్ డేట్!
Balayya 105th Film Title and Release Date Announced బాల‌య్య 105వ చిత్రం టైటిల్, రిలీజ్ డేట్!
Advertisement
Ads by CJ

బాల‌కృష్ణ 105వ చిత్రం ‘రూల‌ర్‌’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌, డిసెంబ‌ర్ 20న సినిమా గ్రాండ్ రిలీజ్‌

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 105వ చిత్రానికి ‘రూల‌ర్‌’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు.

బాల‌కృష్ణ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఆయ‌న ఖాకి యూనిఫాంలో ఉన్న లుక్‌ను ఫస్ట్ లుక్‌గా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. అలాగే గ‌డ్డంతో పాటు డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్లోనూ ఆయ‌న క‌న‌ప‌డుతూ.. చేతిలో సుత్తి ప‌ట్టుకుని ఉన్నారు. బాల‌కృష్ణ డిఫ‌రెంట్ వేరియేషన్స్  ఉన్న పాత్ర‌ను పోషిస్తున్నారు.

ఈ చిత్రంలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తుండ‌గా ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రామోజీ  ఫిలింసిటీలో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే హైద‌రాబాద్‌లో కొత్త షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌కు సిద్ధ‌మ‌వుతుంది. చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

నటీనటులు:

నందమూరి బాలకృష్ణ

సోనాల్ చౌహాన్

వేదిక

ప్రకాశ్ రాజ్

భూమిక చావ్లా

జయసుధ

షాయాజీ షిండే

నాగినీడు

సప్తగిరి

శ్రీనివాస్‌రెడ్డి

రఘుబాబు

ధన్‌రాజ్ తదితరులు

సాంకేతిక నిపుణులు:

దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్

నిర్మాత: సి.కల్యాణ్

కో ప్రొడ్యూసర్స్:  సి.వి.రావ్, పత్సా నాగరాజు

కథ: పరుచూరి మురళి

మ్యూజిక్: చిరంతన్ భట్

సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్

ఆర్ట్: చిన్నా

పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల

ఫైట్స్: రామ్ లక్ష్మణ్, అన్బు, అరివు

కొరియోగ్రఫీ: జానీ మాస్టర్

Balayya 105th Film Title and Release Date Announced:

Ruler is the Balakrishna 105th Film Title

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ