చిరు-కొరటాల మూవీ.. చరణ్ ప్లాన్ మారింది!

Budget decreased to Koratala and Chiranjeevi Film

Thu 24th Oct 2019 02:21 PM
Advertisement
ram charan,koratala siva,chiranjeevi,movie,budget,decreased  చిరు-కొరటాల మూవీ.. చరణ్ ప్లాన్ మారింది!
Budget decreased to Koratala and Chiranjeevi Film చిరు-కొరటాల మూవీ.. చరణ్ ప్లాన్ మారింది!
Advertisement

సైరా తెలుగులో తప్ప ఇతర భాషల్లో ఫెయిల్ అయింది. కేవలం తెలుగులోనే ఈ చిత్రం 120 కోట్లు షేర్ వసూళ్లు చేసింది. అయితే ఎన్నో అంచనాలు మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు వరకే సక్సెస్ అవ్వడంతో రామ్ చరణ్ అండ్ చిరు, కొరటాల శివ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టారు. దాంతో కొరటాల కూడా ప్రెజర్ తీసుకోక తప్పని పరిస్థితి. సైరా అనుకున్న సక్సెస్ అయ్యి ఉంటే వేరేలా ఉండేది కానీ అలా జరగలేదు.

భారీ పెట్టుబడి పెట్టి తీసిన సైరాకు సరైన ప్రాఫిట్స్ రాకపోవడంతో కొరటాల సినిమా బడ్జెట్ కంట్రోలింగ్ చేయక తప్పదని.. సైరాతో వచ్చిన నష్టాలు ఈ చిత్రంతో పూడ్చాల్సిందే అని చరణ్ భావిస్తున్నాడు. చిరు రీఎంట్రీ మూవీ ఖైదీ నెం 150 మాదిరిగానే కొరటాల సినిమా కూడా తక్కువ బడ్జెట్ తో అంటే 25 కోట్లతోనే(రెమ్యూనరేషన్స్ కాకుండా) పూర్తి చేయాలనీ చూస్తున్నారు. తద్వారా భారీ లాభాలు రావొచ్చు అని ఆశిస్తున్నారు.

అందుకు తగ్గ ప్లాన్స్ కూడా వేస్తున్నారు. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. ఇక ఈ మూవీ వచ్చే నెల నవంబర్ నుండి షూటింగ్ స్టార్ట్ చేసుకోనుంది. ఆగష్టులో రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు.

Advertisement

Budget decreased to Koratala and Chiranjeevi Film:

Ram Charan Stand on Koratala and Chiru Combo film

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement