‘ఆర్ఆర్ఆర్’: రెమ్యూనరేషన్ వివరాలివే!

Thu 24th Oct 2019 12:57 PM
ram charan,jr ntr,rajamouli,rrr movie,remuneration  ‘ఆర్ఆర్ఆర్’: రెమ్యూనరేషన్ వివరాలివే!
RRR Stars Remuneration Details ‘ఆర్ఆర్ఆర్’: రెమ్యూనరేషన్ వివరాలివే!
Sponsored links

దాదాపు ఏడాది పైన నుండి ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ చేస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోస్‌గా నటిస్తున్న ఈసినిమా కోసం ఎంత తీసుకున్నారు? రాజమౌళి ఎంత తీసుకున్నారు? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 350 కోట్లు ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్-రామ్ చరణ్ లకు చెరో పాతిక కోట్ల రెమ్యూనరేషన్ గా ఇస్తున్నారని బోగట్టా.

అంతే కాదు దీనితో పాటు వీరికి నెలనెలా షూటింగ్ ఖర్చులు కోసం పది లక్షలు ఇస్తున్నట్టు తెలుస్తుంది. కారణం..వీరు ఎక్కువ కాలం సినిమా కోసం టైమ్ కేటాయించాల్సి వస్తున్నందున వీరి ఖర్చులు కోసం చెరో పది లక్షలు ఇస్తున్నారు. ముందుగానే ఈ డీల్ కుదిరింది అంట. అంటే ఈ లెక్కన వీరికి రెండేళ్ల పాటు షూటింగ్ జరిగితే ఇద్దరు హీరోలకు చెరో 2.40 కోట్ల రూపాయలు అదనంగా వస్తాయన్నమాట.

ఇక రాజమౌళి విషయానికి వస్తే ఈసినిమా కోసం ఆయన రెమ్యూనరేషన్ తీసుకోట్లేదు అంట. లాభాల్లో సగం వాటా ఆయనకే అని నిర్మాత దానయ్యతో ఒప్పందం అని తెలుస్తోంది.

Sponsored links

RRR Stars Remuneration Details:

Ram Charan and Jr NTR Remuneration for RRR

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019