చిరు తర్వాత స్టార్ హీరోతో కొరటాల సినిమా!

Wed 23rd Oct 2019 04:26 PM
megastar chiranjeevi,koratala shiva,young rebal star prabhas,mirchi  చిరు తర్వాత స్టార్ హీరోతో కొరటాల సినిమా!
After Chiru.. Koratala Movie With Star Hero! చిరు తర్వాత స్టార్ హీరోతో కొరటాల సినిమా!
Sponsored links

మెగాస్టార్ చిరంజీవితో స్టార్ డైరెక్టర్లలో ఒకరైన కొరటాల శివ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన చిత్రబృందం త్వరలోనే షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. చిరుతో సినిమా చేయడానికి ఎన్నో రోజులుగా వేచి చూసిన కొరటాల ఎట్టకేలకు అవకాశమైతే దక్కించుకున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత కొరటాల ఏం చేయబోతున్నాడు..? మళ్లీ సినిమాలతో బిజీ అవుతాడా..? లేకుంటే గ్యాప్ తీసుకుంటాడా..? అని ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది.

అయితే ఇక గ్యాప్ తీసుకోవడమంటూ ఉండకూడదని.. చిరు తర్వాత స్టార్ హీరోతో సినిమా చేయాలని కొరటాల భావిస్తున్నారట. అందుకే తాను దర్శకుడిగా అవతారమెత్తిన ‘మిర్చి’ హీరో.. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట. చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కొరటాల.. స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఇప్పుడు మెగా కంపౌండ్‌లోకి వచ్చారు.

ఇటీవల ప్రభాస్- కొర‌టాల అనుకోకుండా భేటీ అయ్యారట. ఈ సందర్భంగా కొన్ని క‌థ‌లు ప్రస్తావ‌న‌కు రాగా.. ఓ కథ మాత్రం డార్లింగ్‌కు బాగా నచ్చిందట. ‘డార్లింగ్ ఈ కథ నాకు.. ఓకే’ అని ప్రభాస్ చెప్పగా.. త్వరలోనే పట్టాలెక్కిద్దామని కొరటాల మాటిచ్చారట. కాగా ప్రస్తుతం.. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్.. చిరుతో సినిమా తెరకెక్కించే పనిలో కొరటాల బిజీబిజీగా ఉన్న విషయం విదితమే. ఇద్దరూ ఖాళీ అయిన తర్వాత పట్టాలెక్కిద్దామని అనుకున్నారట. మరి ఈ కాంబోలో వచ్చిన మొదటి సినిమా ‘మిర్చి’ బాగానే ఘాటెక్కింది.. మరి రెండోసారి కాంబోలో వచ్చేసినిమా ఏ రేంజ్‌లో ఘాటెక్కిస్తుందో వేచి చూడాల్సిందే మరి.

Sponsored links

After Chiru.. Koratala Movie With Star Hero!:

After Chiru.. Koratala Movie With Star Hero!

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019