కోనాపురంలో జరిగిన కథ ట్రైలర్ విడుదల

Tue 22nd Oct 2019 09:57 PM
santhosh kumar,konapuram lo jarigina katha,trailer,poster,launch  కోనాపురంలో జరిగిన కథ ట్రైలర్ విడుదల
Konapuram lo Jarigina Katha Trailer Released కోనాపురంలో జరిగిన కథ ట్రైలర్ విడుదల
Sponsored links

అనూష సినిమా బ్యానర్ లో బట్టు అంజిరెడ్డి, మచ్చ వెంకట్ రెడ్డి  సంయుక్తంగా నిర్మించిన సినిమా కోనాపురంలో జరిగిన కథ  థియేట్రికల్ ట్రైలర్ ను సోమవారం నాడు హైదరాబాద్ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ట్రైలర్ ను, పోస్టర్ ను లాంచ్  చేశారు. కాగా ఈ సినిమాకు  సంబంధించి, నిర్మాతలు, హీరో గజ్వేల్ నియోజకవర్గంకు చెందిన వారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం నుండి, తొలి హీరోగా, తొలి సినిమాగా వస్తున్న నేపథ్యంలో  తెలుగు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సినిమాను ఆదరించాలని ఎంపీ సంతోష్ కుమార్  గారు కోరారు. సినిమా మంచి సామాజిక దృక్పథంతో, సామాజిక బాధ్యతతో కూడిన ఉందని , ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూసి విజయవంతం చేయాలని కోరారు. 

ఈ సినిమా నవంబర్ ఫస్ట్ కు విడుదలవుతున్నట్లు దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ సినిమాని  వరంగల్ జిల్లా  నర్సంపేటకు చెందిన కే బి. కృష్ణ  దర్శకత్వం వహించారు. గజ్వేల్ నుండి తొలి హీరోగా వస్తున్న అనిల్ మొగిలిని ఎంపీ గారు అభినందించారు. ఈ చిత్రానికి  సునీత హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర హీరో అనిల్ మొగిలి, చిత్ర నిర్మాతలు బట్టు అంజిరెడ్డి, మచ్చ వెంకట్ రెడ్డి, దర్శకుడు కె బి కృష్ణ, చిత్ర సహాయకులు, దుంబాల లింగారెడ్డి, మహాదేవుని శ్రీనివాస్ గౌడ్  పాల్గొన్నారు

Sponsored links

Konapuram lo Jarigina Katha Trailer Released:

Santhosh Kumar Launches Konapuram lo Jarigina Katha Trailer

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019