నవంబర్ ఫస్ట్‌కు ‘జిందా గ్యాంగ్’ రిలీజ్

Tue 22nd Oct 2019 07:45 AM
jindaa gang,meghana raj,dev raj,jindaa remake movie  నవంబర్ ఫస్ట్‌కు ‘జిందా గ్యాంగ్’ రిలీజ్
Jindaa Gang Release On November 1st నవంబర్ ఫస్ట్‌కు ‘జిందా గ్యాంగ్’ రిలీజ్
Sponsored links

కన్నడలో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయిన ‘జిందా’ సినిమా తెలుగు హక్కులు ఎస్ మంజు సొంతం చేసుకున్నారు. మంచి ప్రేమ కథ తో ఉత్కంఠ భరిత సన్నివేశాలు గగ్గుర్లు పొడిచే ఫైట్‌లు పోలీస్ ఆఫీసర్‌గా దేవరాజ్ నటన ఈ చిత్రానికే హైలైట్. ‘జిందా’ అనే దొంగల గ్యాంగ్‌లో చదువుపై ఆసక్తి ఉన్న తమ తోటి దొంగని కాలేజీలో చదివిస్తారు. అక్కడ తాను ప్రేమలో పడి తన వాళ్ళ తన గ్యాంగ్ ఎటువంటి పరిణామాలు ఎదుర్కుందో ఆసాంతం ఉత్కంఠ భరితంగా తెరకెక్కించాడు దర్శకుడు ముష్ సంజయ్ మహేష్. సంగీత దర్శకుడు శ్రీధర్ సంగీతం ఈ చిత్రానికి మేజర్ హైలైట్. కౌరవ వెంకటేష్ ‌అందించిన ఒళ్ళు గగ్గుర్లు పొడిచేలా ఫైట్ మన తెలుగు మాస్ ప్రేక్షకులకి ఒక్క విందు భోజనంగా ఉంటుంది.

ఈ సందర్భంగా నిర్మాత ఎస్ మంజు మాట్లాడుతూ.. ‘కన్నడలో జిందా చిత్రం మంచి విజయం సాధించింది. ఫైట్లు, యాక్షన్ సన్నివేశాలు, పోలీస్ ఇంట్రాగేషన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. మన తెలుగు ప్రేక్షకులకి సినిమా చాలా బాగా నచ్చుతుంది. బెండు అప్పారావు సినిమాలో హీరోయిన్‌గా నటించిన మేఘన రాజ్ అందాలు మరియు దేవరాజ్ గారి నటన అద్భుతంగా ఉంటుంది. తెలుగులో ఈ చిత్రాన్ని ‘జిందా గ్యాంగ్’ పేరుతో నవంబర్ ఒకటో తారీఖున విడుదల చేస్తున్నాము’ అని అన్నారు.

Sponsored links

Jindaa Gang Release On November 1st:

Jindaa Gang Release On November 1st

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019