‘అమృతరామమ్‌’ ఫస్ట్ లుక్ రిలీజ్

Tue 22nd Oct 2019 07:38 AM
amrutha ramam,first look,amrutha ramam first look  ‘అమృతరామమ్‌’ ఫస్ట్ లుక్ రిలీజ్
Amrutha Ramam Movie First Look Released ‘అమృతరామమ్‌’ ఫస్ట్ లుక్ రిలీజ్
Sponsored links

రామ్ మిట్టకంటి, అమిత రంగనాథ్‌ జంటగా  సురేందర్ కొంటాడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘అమృత రామమ్’. ‘దేర్‌ ఈజ్‌ నో లవ్‌ విత్ ఔట్‌ పెయిన్‌’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి యస్.ఎన్ రెడ్డి నిర్మాత. ఒక గాఢమైన ప్రేమకథగా ప్రేక్షకులను మెప్పించేందుకు రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను ప్రముఖ నిర్మాత మధురా శ్రీధర్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు సురేందర్ కొంటాడ్డి మాట్లాడుతూ.. "ప్రేమలోని గాఢతను ఈ కథతో చెప్పబోతున్నాం. ఈ ప్రేమకథలో పాటలు హైలెట్‌గా నిలవబోతున్నాయి. ఎన్.ఎస్ ప్రసు అందించిన స్వరాలు ఈ కథలోని ఎమోషన్‌ను బాగా ఎలివేట్ చేశాయి. ఈ మధ్య లవ్ అనేది ఆప్షన్‌గా చాలా మంది చూస్తున్నారు. కానీ, ఈ ప్రేమకథలో ఆప్షన్స్  కనపడవు. హీరోయిన్ అమిత, హీరో రామ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదలకు ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పారు. 

పద్మజా ఫిలింస్‌ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సినిమావాలా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో..

నటీ నటులు:

హీరో: రామ్ మిట్టకంటి

హీరోయిన్: అమిత రంగనాథ్‌

శ్రీజిత్ గంగాధర్

ఎమిలి మార్టిన్

సారా జోన్స్

శుక్రుతి నారాయణ్

చెరుకూరి జగదీశ్వర్‌రావ్

వంశీ దావులూరి


సాంకేతిక నిపుణులు:-

మ్యూజిక్ డైరెక్టర్: ఎన్.ఎస్ ప్రసు

పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే

పిఆర్వో : జి.ఎస్.కె మీడియా

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్

సినిమాటోగ్రఫీ: సంతోష్  శానమోని

నిర్మాత: యస్.ఎన్ రెడ్డి

రచన-దర్శకత్వం: సురేందర్ కొంటాడ్డి

Sponsored links

Amrutha Ramam Movie First Look Released:

Amrutha Ramam Movie First Look Released

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019