ప్రభాస్ తాజా నిర్ణయం సరైనదేనా!?

Mon 21st Oct 2019 04:44 PM
young rebal star prabhas,prabhas new movie,john,tittle change  ప్రభాస్ తాజా నిర్ణయం సరైనదేనా!?
News About Young Rebal Star Prabhas New Movie ప్రభాస్ తాజా నిర్ణయం సరైనదేనా!?
Sponsored links

టాలీవుడ్ యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, పూజా హెగ్దే నటీనటులుగా రాధాకృష్ణ కుమార్ సినిమా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు కానీ.. ‘జాన్’ అనేది మాత్రం పరిశీలనలో ఉంది. అయితే ఈ టైటిలే బాగుందని.. దీన్ని ఫిక్స్ చేసేయండని ప్రభాస్ వీరాభిమానులు సోషల్ మీడియా వేదికగా హడావుడి చేస్తున్నారు. ప్రభాస్ మాత్రం ‘అబ్బే.. ఈ టైటిలేం బాగోలేదు. వెంటనే మార్చేయండి. ఇది మరీ సాఫ్ట్‌గా ఉంది. రొమాంటిక్ టైటిల్ ఎంచుకోండి’ అని డైరెక్టర్‌కు సూచించారని టాక్ నడుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ టైటిల్ విషయంలో మరో సినిమా కూడా ప్రభాస్‌ను బాగా ఇబ్బంది పెట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. శర్వానంద్-సమంత నటీనటులుగా ‘96’ అనే రీమేక్ మూవీ తెలుగులో ‘జానూ’ అని టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇదే దాదాపు ఫిక్స్ అయ్యేట్లుంది. దీంతో ప్రభాస్ మూవీ ‘జాన్’.. అక్కడేమో ‘జానూ’ ఇది కాస్త కన్ఫూజన్.. ఇబ్బందిగానే ఉందని భావించిన డార్లింగ్ టైటిల్ మార్చి తీరాల్సిందేనని తాజాగా నిర్ణయించాడట.

దీంతో టైటిల్ ఆలోచనలో పడ్డ డైరెక్టర్.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ‘బాహుబలి’ బర్త్ డే నాడు టైటిల్ ప్రకటించి సర్‌ఫ్రైజ్ ఇస్తాడని తెలుస్తోంది. అంటే.. బర్త్ డే‌కు గుడ్ న్యూస్ ఉంటుందన్న మాట. మరి రాధాకృష్ణ ఏ టైటిల్‌ను ప్రకటిస్తారో..? అదెలా ఉంటుందో..? ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఏ మాత్రం నచ్చుతుందో అనేది తెలియాల్సి ఉంది.

Sponsored links

News About Young Rebal Star Prabhas New Movie:

News About Young Rebal Star Prabhas New Movie  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019